వరంగల్ అర్బన్: బల్దియా గ్రీవెన్స్‌కు అందిన ఫిర్యాదుల్లో జాప్యం వహిస్తే సహించేది లేదని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గత వారం ప్రజావాణిలో స్వీకరించిన వినతుల పరిష్కారంపై కమిషనర్ విభాగాల వారీగా సమీక్షించారు. గ్రీవెన్స్ సెల్‌కు మొత్తం 116 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్‌కు 51, ఇంజనీరింగ్ 46కు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యానికి 11, రెవెన్యూ సెక్షన్‌కు 6, హార్టికల్చర్ 1, నీటి సరఫరా 1 చొప్పున ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ అడిషనల్ కమిషనర్ సమ్మయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ముఖ్య హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, సెక్రటరీ అనిల్‌బాబు, పన్నుల అధికారి రామకృష్ణ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
బల్దియా కమిషనర్ వెంకన్న


