దివ్యాంగ పిల్లలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ పిల్లలను ప్రోత్సహించాలి

Nov 3 2026 2:15 AM | Updated on Nov 3 2026 2:15 AM

● వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

కాళోజీ సెంటర్‌ : దివ్యాంగ పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపి, వారికి నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన ప్రోత్సాహం అందిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. డీఈఓ ప్రశాంత్‌ రెడ్డి అధ్యక్షతన వరంగల్‌లోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో సోమవారం సమ్మిళిత విద్యపై ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులు, సంబంధిత వ్యక్తులకు నిర్వహించిన జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో భవిత కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. దివ్యాంగ పిల్లల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు, సమాజంలోని ప్రతీ ఒక్కరు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లల అవసరాలను తల్లిదండ్రులు గుర్తించి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడంలో చొరవ చూపాలన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఇతర పిల్లలతో సమానంగా విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక జీవనం, ప్రజా సేవలు పొందే హక్కు ఉందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మిళిత విద్య ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు సాధారణ విద్యార్థులతో కలిసి ఒకే పాఠశాల వాతావరణంలో విద్యనభ్యసించే అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమ సమన్వయకర్త, జిల్లా సమ్మిళిత విద్య కోఆర్డినేటర్‌ కట్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 18 మంది స్పెషల్‌ ఎడ్యుకేటర్లు, 17 మంది ఐఈఆర్పీలు, ముగ్గురు ఫిజియోథెరపిస్టులు సేవలందిస్తున్నారని తెలిపారు. కౌన్సెలింగ్‌ సై కాలజిస్ట్‌ డాక్టర్‌ బరుపాటి గోపి.. దివ్యాంగ పిల్లల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్‌ మహేశ్‌నాయక్‌, డీసీసీబీ కార్యదర్శి కృష్ణమూర్తి, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ విజ య్‌కుమార్‌, ఏఎస్‌ఓ వేణుగోపాల్‌, జిల్లా సైన్స్‌ అధికారి సురేశ్‌బాబు, శ్రవణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

చేనేత వస్త్రాలపై అవగాహన పెంపొందించాలి

కాశిబుగ్గ: చేనేత వస్త్రాలపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. సోమవారం కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఫర్‌ హ్యాండ్లూమ్స్‌, తెలంగాణ రాష్ట్ర చేనేత, సహకార సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలోని రెడ్డి మ్యారేజ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శను ఆమె ప్రారంభించి మాట్లాడారు. చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రొత్సహిస్తూ, వారి ఉత్పత్తులను మార్కెటింగ్‌ సదుపాయాలను కల్పించాలన్నారు. చేనేత కార్మికులకు నిరంతరం పని, ఉపాధి కల్పించడంతోపాటు వారు తయారు చేసిన వస్త్రాలకు డిమాండ్‌ చేసేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్మూ కాశ్మీర్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 60 మంది ప్రాథమిక చేనేత సహకార సంఘాల వస్త్రాలను ప్రదర్శించారు. అలాగే గద్వాల్‌, పోచంపల్లి, వెంకటగిరి, ఉప్పాడ, మంగళగిరి, ధర్మవరం ప్రాంతాల చెందిన ప్రత్యేక చేనేత చీరెలు, డ్రెస్‌ మెటీరియల్స్‌, కరీంనగర్‌ బెడ్‌షీట్లు, బంగిమ్స్‌, టవల్స్‌ ను అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో చేనే త జౌళిశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, వరంగల్‌, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీసీఓ నీరజ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, ఫిషరీష్‌ అధికారి శ్రీపతి పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైంది

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమో దు చేసుకోవాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై సోమవారం ఓ సిటీ నుంచి కాశిబుగ్గ సర్కిల్‌ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ వైవీ గణేశ్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ వసంత పాల్గొన్నారు.

‘ఎల్‌నినో’పాటల సీడీ ఆవిష్కరణ

న్యూశాయంపేట: ఎల్‌నినో ప్రభావం.. ప్రజలు తీ సుకోవాల్సిన జాగ్రత్తలపై పాటల సీడీని కలెక్టర్‌ స త్యశారద సోమవారం ఆవిష్కరించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా కళాకారులు రచించి పా డిన పాటలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. డీపీఆర్‌ఓ ప్రేమలత, కళాకారులు సునీల్‌, రాజేందర్‌, సుమ న్‌, రంజిత్‌, రజిత, శివ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement