కలెక్టరేట్‌లో ‘ఎమ్మెల్సీ’ హెల్ప్‌డెస్క్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ‘ఎమ్మెల్సీ’ హెల్ప్‌డెస్క్‌

Nov 3 2026 2:15 AM | Updated on Nov 3 2026 2:15 AM

న్యూశాయంపేట: వరంగల్‌– ఖమ్మం– నల్ల గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓటరు నమోదు కోసం కలెక్టరేట్‌లో సోమవారం హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఓటరు నమోదుపై ఏమైనా సందేహాలు ఉంటే ఈ హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఓటర్ల తుది జాబితా సిద్ధం కావాలి

● వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి

న్యూశాయంపేట: రాష్ట్రంలో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఈనెల 30వ తేదీ వరకు తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి.. కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ప్రక్రియ పురోగతి, పెండింగ్‌లో ఉన్న అంశాలు, తుది ఓటర్ల జాబితా ప్రచురణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. వీసీలో కలెక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్లు కిషోర్‌కుమార్‌, వై.వీ.గణేష్‌, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement