న్యూస్‌రీల్
భద్రకాళి అమ్మవారి కృపతో వర్షాలు సమృద్ధిగా కురవాలి
నిరుత్సాహపర్చిన నిర్వహణ!
తారాజువ్వల వెలుగుల్లో ఉర్సుగుట్ట
తారాజువ్వలు తళుక్కుమనగా.. నిశీధి దేశాన మిణుగురులు పూశాయి. ఊరూవాడా ఒక్కటై కదలగా.. రహదారులన్నీ చీమల దండయ్యాయి. లక్షల కళ్లు ఆత్రుతగా నిరీక్షించగా.. ఉర్సు గుట్ట ఉరకలేసి దశకంఠుడి ప్రతిమను దహనం చేసింది.
ఉర్సు రంగలీల మైదానంలో రావణ వధను వీక్షించేందుకు వచ్చిన ప్రజలు
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో మంగళవారం సాయంత్రం దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఈవేడుకలు తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చారు. దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదితలలతో ఉన్న 72 అడుగుల రావణ ప్రతిమ దహన ఘట్టం నేత్రపర్వంగా సాగింది. మిరుమిట్లు గొలుపే వెలుగుల్లో బాణసంచా పేలుళ్లతో ప్రాంగణం మార్మోగింది.
ప్రధాన ఘట్టంగా రథయాత్ర..
దసరా ఉత్సవాల సందర్భంగా కరీమాబాద్ రామస్వామి గుడి నుంచి శ్రీసీతారామాంజనేయ, లక్ష్మ ణుడి ఉత్సవ విగ్రహాలను రథంపై తీసుకొచ్చారు. దారి వెంట కోలాటం, దాండియా నృత్యాలు, డప్పు చప్పుళ్లు, వాయిద్యాలు, భజనలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వేదపండితులు సంస్కృతీసంప్రదాయాలతో శాసీ్త్రయంగా శమీ పూజ నిర్వహించారు. అనంతరం పాలపిట్టను లక్షలాది మంది దర్శనం చేసుకున్నారు.
రావణుడి ప్రతిమ దహనం..
ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ పరికరం ద్వారా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, కుడా(కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్‌పర్సన్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద. సీపీ శ్వేత, బల్దియా కమిషనర్ వెంకన్న, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్‌తో కలిసి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ స్విచ్ ఆన్ చేసి భారీ రావణాసురుడి ప్రతిమను దహనం చేశారు. 100 మందికి పైగా టెక్నీషియన్లు పేల్చిన వివిధ రకాల బాణసంచా మోతలతో రంగలీల మైదానం దద్దరల్లిపోయింది. వేదికపై సాంస్కృతిక నృత్యాలు యువతను కేరింతలు కొట్టించాయి.
ప్రశాంతంగా ఉత్సవాలు..
ప్రజాప్రతినిధులు ఆలస్యంగా రావడంతో రాత్రి 8.30 గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. సీపీ శ్వేత ఆదేశాల మేరకు డీసీపీలు, ఏసీపీల పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్లు కర్రె స్వామి, మంగీలాల్, సుక్రూ నేతృత్వంలో ఎస్సైలు, స్పెషల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎల్.కిశోర్‌కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఆర్టీఓ సుమ, దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్‌బాబు, కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షుడు గోనె రాంప్రసాద్, తహసీల్దార్ ఇక్బాల్, కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
తోపులాట నుంచి బాలుడిని బయటకు తీసుకొస్తున్న పోలీసు సిబ్బంది
రంగలీల మైదానంలో ఘనంగా దసరా సంబురాలు
72 అడుగుల రావణ ప్రతిమ దహనం
ఆకట్టుకున్న సాంస్కతిక కార్యక్రమాలు
కిక్కిరిసిన రహదారులు
బాణసంచా మోతలతో
దద్దరిల్లిన ప్రాంగణం
రైతులు బాగుంటేనే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. చెడుపై విజయం సాధించడమే విజయ దశమి అని, రంగలీల మైదానంలో సంప్రదాయబద్ధంగా దసరా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. భద్రకాళి అమ్మవారి కృపతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. అనంతరం కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు నీరు, విద్యుత్‌ను పొదువుగా వినియోగించుకోవాలని సూచించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, సీ పీ శ్వేత మాట్లాడుతూ శ్రీరాముడి సుగుణాలు, ఆదర్శంతమైన జీవనం కారణంగానే ఆయనను ప్రజలు దైవంగా కొలుస్తున్నారన్నారు.
రంగలీల మైదానం ప్రవేశ ద్వారం వద్ద రద్దీ, తోపులాట
సామాన్య భక్తులకు తప్పని తిప్పలు
పాస్‌ల పంపిణీపై విమర్శలు


