చిన్నారులకు రిస్ట్‌ బ్యాండ్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు రిస్ట్‌ బ్యాండ్ల పంపిణీ

Oct 19 2026 7:24 AM | Updated on Oct 19 2026 7:24 AM

చిన్నారులకు రిస్ట్‌ బ్యాండ్ల పంపిణీ

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఉర్సు రంగలీల మైదానంలో ఆదివారం సాయంత్రం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో తహసీల్దార్‌ ఇక్బాల్‌, పర్యాటక శాఖ, ఇతర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో చిన్నారుల భద్రతకు ప్రత్యేక రిస్ట్‌ బ్యాండ్లను పంపిణీ చేశారు. వీటిపై తల్లిదండ్రుల మొబైల్‌ నంబర్లను నమోదు చేశారు. పిల్లలు తప్పిపోగానే అక్కడ ఉన్నవారు గుర్తించి రిస్ట్‌ బ్యాండ్లపై ఉన్న నంబర్లకు ఫోన్‌ ద్వారా సమాచారం అందేలా కలెక్టర్‌ చొరవ తీసుకున్నారు. దీంతో హ్యాట్సాప్‌ కలెక్టరమ్మా.. అంటూ మహిళలు ప్రశంసలు కురిపించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రిస్ట్‌ బ్యాండ్లను పంపిణీ చేశామని తహసీల్దార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్‌, పర్యాటకశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement