నేడు సద్దుల బతుకమ్మ | - | Sakshi
Sakshi News home page

నేడు సద్దుల బతుకమ్మ

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

నేడు సద్దుల బతుకమ్మ

హన్మకొండ కల్చరల్‌: నగరంలో సద్దుల బతుకమ్మ సందడి నెలకొంది. ఆదివారం సద్దులు కావడంతో బతుకమ్మను పేర్చడానికి కావాల్సిన తంగేడు వివిధ రంగులలో ముంచిన గునుగుపూలు, తామర పూలు, చామంతి, బంతి, సీతజడలు, గుమ్మడి ఆకులు తదితర కొనుగోళ్లతో శనివారం ట్రైసిటీలోని రోడ్లు కిక్కిరిసిపోయాయి. యువతులు గాజులు, తదితర అలంకరణ సామగ్రి కొనుగోలు చేశారు. హనుమకొండ చౌరస్తా, కుమార్‌పల్లి, టైలర్‌స్ట్రీట్‌, అంబేడ్కర్‌ సెంటర్‌, అదాలత్‌సెంటర్‌, వరంగల్‌లోని పిన్నావారి వీధి, రామన్నపేట, బట్టలబజార్‌, కాశీబుగ్గ, గోపాలస్వామి గుడి, హనుమకొండ భవానీనగర్‌బోర్డు, సుబేదారిలోని అమరవీరుల స్తూపం, కాజీపేటలోని బాపూజీనగర్‌ తదితర ప్రాంతాల్లో అమ్మకాలు జోరుగా సాగాయి.

చెరువుల వద్ద ఏర్పాట్లు..

నగరంలో ప్రధానంగా హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం, వరంగల్‌లోని ఉర్సురంగలీలా మైదానంతోపాటు వడ్డేపల్లి చెరువు భద్రకాళి చెరువు, ఎస్వీ రోడ్డులోని పోతన మందిరం, పెద్దచెరువు, మడికొండ, రాంపూర్‌, హసన్‌పర్తి చెరువులు, బెస్తం చెరువు, శివనగర్‌, సిద్ధేశ్వరగుండం, పడమరకోట, తదితర చెరువుల వద్ద ఏర్పాట్లు చేశారు. పద్మాక్షి ఆలయం, ఉర్సురంగ లీలా మైదానం వద్ద హైమాస్ట్‌ లైట్లతో విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పూలు, అలంకరణ సామగ్రి కొనుగోళ్లతో రోడ్లన్నీ రద్దీ

చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement