వర్షంతో తడిసిముద్దయిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

వర్షంతో తడిసిముద్దయిన భక్తజనం

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

– 8లోu నేటి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడలు వాయిదా వేయిస్తంభాల ఆలయంలో త్రిశూలస్నానం అక్టోబర్‌ 5న మెగా జాబ్‌ మేళా అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం పకడ్బందీ ఏర్పాట్ల నడుమ – మరిన్ని ఫొటోలు 9లోu ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

వరంగల్‌ చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం బారులుదీరిన వాహనాలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో ఈనెల 24 నుంచి నిర్వహించనున్న కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ ఎంపిక పోటీలు వర్షం కారణంగా వాయిదా వేసినట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా నిర్వహణ కార్యదర్శి వాసుదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటితోపాటు ఇటీవల వాయిదా పడిన రెజ్లింగ్‌ అండర్‌ 14, 17 ఎంపికలు కూడా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది ప్రకటించనున్నట్లు తెలిపారు.

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న ఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం గణపతి నిమజ్జనం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో మూల మహాగణపతికి అభిషేక పూజలు చేశారు. ఉత్సవమూర్తికి పల్లకీసేవ నిర్వహించారు. ఇందులో సినీ నటుడు, కవి తనికెళ్ల భరణి పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌, అర్చకుడు గంగు ఉపేంద్రశర్మతో పాటు వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్‌, శ్రవణ్‌కుమార్‌, కాశీలింగాచారి, వేముగంటి దత్తుశర్మ, భక్తులు ఢమరుక వాయిద్యాలు, మంగళహారతులతో కాషాయజెండాలతో విఘ్నగణపతిని, స్వామివారి త్రిశూలాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రాచీన కోనేటిలో త్రిశూలస్నానం (తీర్థోత్సవం) జరిపారు. అనంతరం రుద్రేశ్వరుడి సన్నిధిలో త్రిశూలాన్ని యథాస్థానంలో ఉంచారు. అనంతరం ఉత్సవ మహాగణపతి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ఊరేగించి పద్మాక్షి గుండంలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, ప్రభాకర్‌ దంపతులు పాల్గొన్నారు.

హన్మకొండ అర్బన్‌: నగరంలోని న్యూసైన్స్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో వచ్చే నెల 5న మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ కటంగూరి రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు బుధవారం కళాశాల ఆవరణలో జాబ్‌ మేళాకు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ జాబ్‌మేళాలో 50కిపైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌.కమలాకర్‌, తెలంగాణ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఆలిండియా ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జయరాం, వివిధ కంపెనీల ప్రతినిధులు, కళాశాల ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఆషాద్‌ఖాన్‌ పాల్గొన్నారు.

విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సుల విద్యార్థుల బోధనకు అతిథి అధ్యాపకుల నియమకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య గుర్రం శ్రీనివాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ విభాగంలో రెండు పోస్టులకు, ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ ఒక పోస్టుకు, ఎంఏ తెలుగు ఒక పోస్టుకు అర్హులైన అధ్యాపకులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సంబంధిత పీజీ సబ్జెక్టుల్లో 55 శాతానికి తక్కువ కాకుండా మార్కులు కలిగి ఉండాలని, ఎస్సీఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్నారు. పీహెచ్‌డీ, నెట్‌, బోధనలో అనుభవం కలిగినవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈనెల 26 సాయంత్రం 4:30 గంటల్లోగా దరఖాస్తులు కళాశాలల్లో సమర్పించాలని సూచించారు.

రెండు భాగాలైన తెప్ప

చిన్నవడ్డేపల్లి చెరువులో భారీ విగ్రహాన్ని తెప్పపై నుంచి నిమజ్జనం చేస్తున్న క్రమంలో అదుపుతప్పి ఒకవైపు పడింది. దీంతో తెప్ప రెండు భాగాలుగా విడిపోయింది. పలువురు సిబ్బంది నీటిలో పడిపోయారు. విగ్రహం ఎవరిమీద పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

హనుమకొండ నగరంలో నిమజ్జన శోభాయాత్రలో చిందులేస్తున్న యువత

నగర పరిధి 17 చెరువుల వద్ద రూ.2 కోట్ల నిధులు వెచ్చించి ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. ఆయా ప్రాంతాల్లో 30 క్రేన్లను అందుబాటులో ఉంచారు. వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద హనుమకొండ కలెక్టర్‌, బల్దియా ప్రత్యాకాధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌, వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద, ‘కుడా’ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ టి.వెంకన్న, ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఆయా విభాగాల అధికారులతో కలిసి ఘనంగా నిమ్జనాన్ని ప్రారంభించారు. రంగసముద్రం చెరువు వద్ద ఏర్పాట్లను కలెక్టర్‌ సత్యశారద పరిశీలించారు.

గ్రేటర్‌లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర

కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అధికారులు

చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద చిన్న అపశ్రుతి

వినాయక శోభాయాత్రలో స్టెప్పులేస్తున్న యువతులు, చిన్నారులు, మహిళలు

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో బుధవారం వైభవంగా నినాయక నిమజ్జనోత్సవం జరిగింది. వాడవాడలా కొలువుదీరన గణపయ్యలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళ హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకుల ఎదుట మహిళలు, యువతులు కోలాటాలతో ఆడిపాడి సందడి చేశారు. గణనాథుడికి ఘన వీడ్కోలు పలికారు. ఈసారి డీజేలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో డప్పుచప్పుళ్లు, బ్యాండ్‌ మేళాలు, బాజాభజంత్రీలు, భజనలతో సాంస్కృతిక శోభ నెలకొంది.

ఓ వైపు వర్షం.. మరో వైపు నిమజ్జనం

ఓ వైపు నగరంలో మోస్తరు వర్షం కురుస్తున్నప్పటికీ మరో వైపు నిమజ్జనం హోరెత్తింది.

● గొర్రెకుంట కట్టమల్లన్న, గుండు చెరువు అగర్తల, బెస్తం చెరువు, ఉర్సు రంగ సముద్రం, హనుమకొండలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్‌పర్తి, మడికొండ, తదితర చెరువుల వద్ద పకడ్బందీ ఏర్పాట్లతో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేశారు.

● పెద్ద క్రేన్లు, తెప్పలు, బారికేడ్లు, గజ ఈతగాళ్లు, పోలీసులు, గ్రేటర్‌ వరంగల్‌ ఇంజనీర్లు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు.

● వాటర్‌ ట్యాంకర్లను అందుబాటులో ఉంచి భక్తులకు తాగునీరందించారు.

● వర్షం కారణంగా ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సేవలు అందించారు.

● ఆయా ప్రాంతాల్లో హనుమకొండ, వరంగల్‌ అదనపు కలెక్టర్లు ఎన్‌.రవి, ఎల్‌.కిషోర్‌, వైవీ.గణేశ్‌, బల్దియా కమిషనర్‌ వెంకన్న, డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, అధికారులతో కలిసి ఏర్పాట్లు తదితరులు పరిశీలించారు.

గణపయ్యను తీసుకెళ్లడానికి గంగమ్మ వర్షమై వచ్చింది. ఘణనాథుడి పాదాలు తాకాలని మేఘాలు కరిగి నేలను చేరాయి. వాన చినుకులు భక్తుల నెత్తిన అక్షింతలయ్యాయి. తన్మయత్వం చెందిన యువత ఆడిపాడి సందడి చేశారు. కురుస్తున్న వానను సైతం లెక్కచేయకుండా గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో వినాయక శోభాయాత్ర, నిమజ్జనం బుధవారం వైభవంగా జరిగింది. ఆదిదేవుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు మధ్యాహ్నం నుంచే చెరువుల వద్ద వాహనాలు బారులుదీరాయి.

– వరంగల్‌ అర్బన్‌/హన్మకొండ అర్బన్‌/

హసన్‌పర్తి/ఖిలా వరంగల్‌/కాశిబుగ్గ

కాశిబుగ్గ: జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని వరంగల్‌ డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి ఆదేశించారు. వరంగల్‌ వెంకట్రామ జంక్షన్‌లోని సంరక్ష సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. తెలంగాణ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ నిబంధనల అమలు, వివిధ రికార్డులు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అనుమతులు, బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించారు. ఎస్‌టీపీ, ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు తనిఖీ చేశారు. అలాగే, డయాగ్నోస్టిక్స్‌ విభాగం, జనరల్‌ వార్డులు, ఐసీయూలను పరిశీలించి, పేషంట్లకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ టారిఫ్‌ బోర్డులో ప్రదర్శించిన ఫీజుల మేరకు పేషంట్లను నుంచి చార్జీలు వసూలు చేయాలని, మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. పేషంట్లకు అవసరమైన డయాగ్నోస్టిక్‌ పరీక్షలను మాత్రమే నిర్వహించాలన్నారు. హాస్పిటల్‌లో అందిస్తున్న సేవలు, టారిఫ్‌లు, వైద్యులు, సిబ్బంది వివరాలను కౌంటర్‌ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. స్కానింగ్‌ నిర్వహించే హాస్పిటల్స్‌, స్కానింగ్‌ కేంద్రాలు తప్పకుండా పీపీఎన్‌డీటీ యాక్ట్‌ 1994 ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. ఈ చట్టం ప్రకారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నిషేధమని, ఎవరైనా చేసినా, ప్రోత్సహించినా, చేయమని అడిగినా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా, 3 నెలల నుంచి 5 నెలల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఆయన వెంట స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ప్రసన్నకుమార్‌, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, నాగరాజు పాల్గొన్నారు.

వరంగల్‌ డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి

సంరక్ష సూపర్‌ స్పెషాలిటీ

హాస్పిటల్‌లో తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement