– వివరాలు
8లోu
నగరం జలమయం
హన్మకొండ అర్బన్/వరంగల్ అర్బన్/విద్యారణ్యపురి: భారీ వర్షాలు కురుస్తున్నందున నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్, కమిషనర్ టి.వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసర సాయం కోసం జీడబ్ల్యూఎంసీని ఆశ్రయించాలన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. పారిశుద్ధ్య సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగం, ఎలక్ట్రికల్ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వంతెనలు, చెరువులు, జలాశయాలు, రోడ్లు, పాత భవనాలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
నేడు విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాల కారణంగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద ఆదేశాల మేరకు నేడు (గురువారం) అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆయా జిల్లాల డీఈఓలు, ఎల్వీ గిరిరాజ్‌గౌడ్, రంగయ్యనాయుడు బుధవారం రాత్రి వేర్వేరు ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 24న ప్రకటించిన సెలవుకు బదులు అక్టోబర్ 10న రెండో శనివారం పనిదినంగా పరిగణించాలని వారు స్పష్టం చేశారు.
గ్రేటర్‌లో వర్షపు నీటితో నిండిన లోతట్టు ప్రాంతాలు
ఇబ్బందులు పడిన
వాహనదారులు, ప్రజలు
హనుమకొండ కలెక్టర్, బల్దియా
ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్
నగరంలో భారీ వర్షాలు కురిసే
అవకాశం


