శ్రీభద్రకాళి దేవాయంలో శ్రావణపౌర్ణమి అమ్మవారికి పవిత్రోత్సవం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని సందర్శించారు ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తికి అలంకరించారు. పసుపు, ఎరుపు, నారింజ, నీలి, గులాబీ తదితర రంగుల ఊలు దారాలతో అలంకృతమైన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు దేవాలయాన్ని సందర్శించిన భక్తులకు రక్షాకంకణాలు అందించారు. – హన్మకొండ కల్చరల్


