హైస్పీడ్‌ కారిడార్‌ కవచ్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

హైస్పీడ్‌ కారిడార్‌ కవచ్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

Aug 29 2026 2:04 AM | Updated on Aug 29 2026 2:04 AM

హైస్పీడ్‌ కారిడార్‌ కవచ్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ కేయూలో ఎంబీఏ స్పాట్‌ అడ్మిషన్లు నేడు వరంగల్‌, కాజీపేట రైల్వే స్టేషన్లలో జీఎం పర్యటన కలెక్టర్‌కు రాఖీ కట్టిన బాలసదన్‌ బాలికలు

కాజీపేట రూరల్‌ : రైలు ప్రమాదాలను నివారించేందుకు చేపట్టిన హైస్పీడ్‌ కారిడార్‌ కవచ్‌ రైల్వే ప్రాజెక్ట్‌ ట్రయల్‌ రన్‌ శుక్రవారం విజయవంతమైంది. బల్లార్షా నుంచి కాజీపేట వరకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ తొలుత బల్లార్షా–మకోడి వరకు పూర్తి చేశారు. మకోడి నుంచి కాజీపేట వరకు పనులు కొనసాగుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. దక్షిణమధ్య రైల్వే సీఎస్‌టీఈ ప్రాజెక్ట్‌ ఎం.కోటేశ్వర్‌రావు, డిప్యూటీ సీఎస్‌టీఈ ప్రాజెక్ట్‌ జి.కుమరన్‌ ఆధ్వర్యంలో రైల్వే కవచ్‌ ప్రాజెక్ట్‌ పనులు నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నాలుగు నెలల క్రితం ప్రారంభించిన ఈ పనులు డబుల్‌ లైన్‌లో శరవేగంగా సాగుతున్నట్లు చెప్పారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం (2026–2027) ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.నర్సింహాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పాట్‌ అడ్మిషన్లు ఈనెల 31నుంచి సెప్టెంబర్‌ 3వ తేదీ వరకు ఉంటాయని పేర్కొన్నారు. టీఎస్‌ఐసెట్‌ –2026లో అర్హత సాధించిన అభ్యర్థులతోపాటు అర్హత సాఽధించని వారు కూడా హాజరుకావచ్చునని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువపత్రాలతోపాటు అవసరమైన ఫీజు తీసుకొని రావాలని సూచించారు. స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు పొందే అభ్యరులు ఫీజు రీయంబర్స్‌మెంటుకు అర్హులు కాదని పేర్కొన్నారు. మార్గదర్శకాలు టీజీఐసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు యూనివర్సిటీలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల నోటీస్‌ బోర్డులో ఉంచామని ప్రిన్సిపాల్‌ నర్సింహాచారి వివరించారు.

స్కూల్‌ ఆఫ్‌ లెర్నింగ్‌లోనూ..

కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రంలోని స్కూల్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ (కేయూ ఎస్‌ఎల్‌)లో ఈ విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు దూరవిద్యాకేంద్రం డైరెక్టర్‌ బి.సురేష్‌లాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీఐసెట్‌ –2026 అర్హత సాధించిన, అర్హత సాధించని అభ్యర్థులు కూడా తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఈనెల 31నుంచి సెప్టెంబర్‌ 3 వరకు హాజరై ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు.

కాజీపేట రూరల్‌ : కాజీపేట, వరంగల్‌ రైల్వే స్టేషన్‌లలో శనివారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ, సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం, ఇతర విభాగాల రైల్వే ఉన్నతాధికారుల బృందం పర్యటించనున్నట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. బృంద సభ్యులు ఆయా రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేస్తారని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌నుంచి ప్రత్యేక రైలులో రైల్వే జీఎం 23:45 గంటలకు బయలుదేరి కాజీపేట జంక్షన్‌ వరకు పుట్‌ ప్లేట్‌ ఇన్స్‌పెక్షన్‌ చేసుకుంటూ శనివారం తెల్లవారుజూమున 01:39 గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటారని తెలిపారు. కాజీపేట నుంచి వరంగల్‌కు రోడ్‌ మార్గంలో వెళ్తారని, వరంగల్‌ స్టేషన్‌ తనిఖీ అనంతరం రోడ్డు మార్గంలో కాజీపేట జంక్షన్‌కు చేరుకొని సాయంత్రం 16:30 గంటలకు బయలుదేరుతారని వివరించారు. 20:00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటారని తెలిపారు.

హన్మకొండ అర్బన్‌ : హనుమకొండ కలెక్టరేట్‌లో శుక్రవారం రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుబేదారిలోని బాలసదన్‌ బాలికలు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కి రాఖీలు కట్టి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, బాలసదన్‌ సూపరింటెండెంట్‌ కళ్యాణి,

సిబ్బంది, బాలికలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement