ఏసీల మరమ్మతుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఏసీల మరమ్మతుకు చర్యలు

Aug 7 2026 12:56 AM | Updated on Aug 7 2026 12:56 AM

ఏసీల మరమ్మతుకు చర్యలు

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో బర్న్స్‌ వార్డును సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌కుమార్‌రెడ్డి గురువారం సందర్శించారు. సాక్షిలో ‘నా శరీరం కాలి మండుతోంది.. చల్లదనం కావాలి’ శీర్షికన గురువారం ప్రచురితమైన కథనానికి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాంకుమార్‌రెడ్డితో పాటు ఆర్‌ఎంఓ–2 డాక్టర్‌ మధుకర్‌ యాదవ్‌ స్పందించారు. బర్న్స్‌ వార్డులో చికిత్స పొందుతున్న యువకుడి ఆరోగ్య స్థితిని పరిశీలించారు. ఏసీలు పనిచేయకపోవడం వల్ల పేషెంట్‌ ఇబ్బందులు పడుతున్నాడని కుటుంబ సభ్యులు వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై శుక్రవారం సంబంధిత వైద్యులతో మాట్లాడి ఏసీల మరమ్మతుపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement