న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న పరిపాలన భవన నిర్మాణ పనుల పురోగతిని గురువారం కమిషనర్ టి.వెంకన్న తనిఖీ చేశారు. పనులు వేగవంతం చేసి, గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారుల కు పలు సూచనలిచ్చారు. మ్యూజియం ప్రాంగణంలోని శిల్పాలను పురావస్తు శాఖ ద్వారా సురక్షితంగా తగిన ప్రదేశానికి తరలించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. ఆయన వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రోజా, ఇంజనీరింగ్ అధికారులున్నారు.
జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి..
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కమిషనర్ టి.వెంకన్న పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట అదనపు కమిషనర్ ఈసంపల్లి జోనా, ఎస్‌ఈ రాజ్‌కుమార్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, ఉప కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, ప్రసన్నరాణి, సమ్మయ్య, కార్యదర్శి అనిల్ బాబు, ఎంహెచ్‌ఓ రాజేశ్, అకౌంట్స్ అధికారి శివలింగం, సూపరింటెండెంట్ బాకం సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.


