అదనంగా రూపాయి కూడా తీసుకురాలే | - | Sakshi
Sakshi News home page

అదనంగా రూపాయి కూడా తీసుకురాలే

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రూపాయి కూడా అదనపు నిధులు తీసుకురాలేని చేతగాని దద్దమ్మలు మన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నో ఏళ్లుగా కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుయే ప్రధాని మోదీకి, బీజేపీ నేతలు ఇష్టం లేదని, మొదటి నుంచి తెలంగాణ అభివృద్ధికి ఆ టంకాలు సృష్టించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. కిషన్‌రెడ్డి, సంజయ్‌ కేంద్ర మంత్రులుగా ఉండి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తెలంగాణ ద్రోహి అని సంబోధించడం ఆయన అహంకారానికి నిదర్శమని విమర్శించారు. సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ రాంబాబు, మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ నీల రాజమ్మగట్టయ్య పాల్గొన్నారు.

కేంద్ర మంత్రులను నిలదీసిన

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement
 
Advertisement
Advertisement