సాక్షి, వరంగల్: పరాభవనామ సంవత్సరంలో వరంగల్ జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూనే కొన్ని కీలక సవాళ్లను ఎదుర్కోనుంది. మౌలిక వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాను ముందుకు నడిపితే.. వ్యవసాయం, వాతావరణం, పరిపాలన సమస్యలు కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మౌలిక వసతుల కల్పన కోసం..
హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి కేంద్రంగా గ్రేటర్ వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడం కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్న గ్రేటర్ వరంగల్‌లో వరద, మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఉద్దేశించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూడీజీ) ప్రాజెక్టుకు రూ.5,257 కోట్లతో ఫేజ్–1 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, ఏళ్లుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడంతో ఆ నిర్మాణ పనులు కూడా ఈ ఏడాదిలో ప్రారంభించే అవకాశముంది. రంగశాయిపేట నాయుడు పెట్రోల్‌బంకు నుంచి ఆరెపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెరగనుంది. కేంద్రం తీసుకొచ్చిన ‘సాస్కీ’ ప్రాజెక్టు కింద రూ.300 కోట్లతో కీలక ప్రాజెక్టులు, వివిధ పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది.
– శ్రీరామోజు వీరబ్రహ్మచార్యులు, జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి, ఓసిటీ, వరంగల్
హనుమకొండ ప్రాంత శుభాశుభ ఫలితాలు
హన్మకొండ కల్చరల్: శ్రీపరాభవ నామసంవత్సరంలో హనుమకొండ జిల్లా పునర్వసు నక్షత్రం, మిధునరాశి అవుతుంది. ఈ సంవత్సరం గురువు జూన్ 1వరకు ఒకటో స్థానంలో ఉండి స్థానిక సమస్యల అవగాహన, ఆర్థిక, అభివృద్ధి పనుల్లో చురుకుగా ఉండగలదు. గురుగ్రహం వల్ల శుభం కలుగుతుంది. డిసెంబర్ నుంచి రాహు, కేతుల వల్ల స్థానమార్పులు ఉంటాయి. కొంత ప్రతికూల పరిస్థితులు, స్థానిక సమస్యలు ఏర్పడుతాయి. వీటిని అధిగమించే అవకాశం ఉంది.
పరాభవ నామ సంవత్సరంలో
వరంగల్, హనుమకొండ జిల్లాల జాతకం
కీలక ప్రాజెక్టులకు కోట్లాది
రూపాయల ఖర్చు
త్వరలో నగరంలో
యూజీడీ పనులు ప్రారంభం
జిల్లాల వారీగా..
జిల్లా : వరంగల్ హనుమకొండ
రాశి : వృషభం మిథునరాశి
నక్షత్రం : రోహిణి పునర్వసు
ఆదాయం : 5 08
వ్యయం : 14 11


