ఘనంగా వసంత నవరాత్రోత్సవాలు షురూ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వసంత నవరాత్రోత్సవాలు షురూ

Mar 20 2026 9:21 AM | Updated on Mar 20 2026 9:21 AM

ఘనంగా వసంత నవరాత్రోత్సవాలు షురూ

ఘనంగా అమ్మవారికి పసుపు రంగు

చామంతులతో లక్ష పుష్పార్చన

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం చైత్రమాసం పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి నిర్మాల్య సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వసంత నవరాత్ర ఉత్సవాలు జరపడానికి అనుజ్ఞాప్రార్థన జరిపి పూర్ణాభిషేకం నిర్వహించి అమ్మవారిని పూలమాలలతో శోభా యమానంగా అలంకరించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమా దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్న అనంతరం అమ్మవారి సన్నిధిలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఉగాది పర్వదినం కావడంతో భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. లక్ష పుష్పార్చనలో భాగంగా ఉత్సవాల మొదటిరోజు పసుపు రంగు చామంతులకు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ డాక్టర్‌ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు జ్యోతిష్య పండితులు అయినవోలు రాధాకృష్ణశర్మ సిద్ధాంతిచే పంచాంగ పఠనం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement