లక్ష్య సాధనకు ఇష్టపడి చదవాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధనకు ఇష్టపడి చదవాలి

Mar 20 2026 9:21 AM | Updated on Mar 20 2026 9:21 AM

లక్ష్య సాధనకు ఇష్టపడి చదవాలి పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనం.. మానసిక దివ్యాంగుల సమస్యలు ప్రస్తావిస్తా

సివిల్స్‌ 123వ ర్యాంకర్‌ అట్ల తరుణ్‌తేజ

కాజీపేట అర్బన్‌: లక్ష్యాన్ని ఎంచుకుని సాధించేందుకు ఇష్టపడి చదవాలని సివిల్స్‌ 123వ ర్యాంకు సాధించిన అట్ల తరుణ్‌ తేజ అన్నారు. హంటర్‌ రోడ్డులోని శ్రీవ్యాస ఆవాసంలో గురువారం సులక్ష్య సేవాసమితి 13వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సివిల్స్‌ సాధించాలనే సంకల్పంతో నాలుగుసార్లు విఫలమైనా ఐదోసారి 123వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఓటమితో కుంగిపోకుండా విజయం సాధించే వరకు శ్రమించాలన్నారు. సమాజ సేవలో సులక్ష్య సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆవాసంలోని చిన్నారులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో భారతీయ వాయుసేన ఆఫీసర్‌ అనిల్‌కుమార్‌ త్రిపాఠి, సేవా సమితి వ్యవస్థాపక, అధ్యక్షుడు మండువ సంతోశ్‌, సాయికిరణ్‌, వినయ్‌, ప్రణీత్‌, వసుంధర, రామాచారి పాల్గొన్నారు.

హన్మకొండ కల్చరల్‌: పోతన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో గురువారం పీఠం కార్యవర్గసభ్యులు గంధ శ్రీనివాస్‌, బన్న అయిలయ్య, ఎన్వీఎన్‌ చారి, అడ్టూరి చంద్రశేఖర్‌, జూలూరు నాగరాజు పాల్గొని పసుమర్తి సాంబశివ సోమయాజులు రాసిన ‘భూకంపాలు జ్యోతిష్య శాస్త్ర పరిశీలన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉగాదిని పురస్కరించుకుని కవులు వల్స పైడి, జూలూరు నాగరాజు, కుడికాల జనార్దన్‌ తదితరులు కవితాగానం చేశారు. ఈసందర్భంగా సాంబశివ సోమయాజులుకు జ్యోతిష్య జ్ఞానరత్న పురస్కారం ప్రదానం చేశారు. అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన నగరానికి చెందిన వీఆర్‌ విద్యార్థి, రాజశేఖర్‌, రమేశ్‌బాబు, సుబేదార్‌ ప్రభాకర్‌, చెనుమల్ల శ్రీధర్‌ను సన్మానించి పోతన పురస్కారాలు ప్రదానం చేశారు.

ఎంపీ కడియం కావ్య

హన్మకొండ అర్బన్‌: మానసిక దివ్యాంగుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య అన్నారు. మానసిక దివ్యాంగులపై ఉన్న అపోహలు, వివక్ష తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధార్‌ లింకేజీ సమస్యల వల్ల పలువురు దివ్యాంగులు పెన్షన్లు, వైద్య సదుపాయాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో గురువారం మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి ఎంపీ కడియం కావ్య, స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకున్నారు. కడియం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చిన్నారులకు కొత్త బట్టలు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు రామలీల, కళ్యాణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement