సౌత్‌జోన్ టోర్నమెంట్‌కు హాకీ పురుషుల జట్టు
● కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వెంకయ్య
కేయూ క్యాంపస్: చైన్నెలోని సత్యభామ యూనివర్సిటీలో ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ టోర్నమెంట్‌లో కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్లు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య ఆదివారం తెలిపారు. జట్టులో జి. ప్రవీణ్, యూ. అరవింద్, ఎస్. సుదర్శన్, ఎం. నగేశ్, సి. హెచ్ వంశీ, షేక్ సోహెల్ అబ్బాస్ , మహ్మద్ ఉస్మాన్ ఘని, వి. సందీప్ , ఎ. అఖిల్ , బి. అభినాష్, కె. నాగేంద్రబాబు, కె. జంగు, ఎ. మారుతి, బి. అఖిల్, జి. రాజు, ఎన్. మల్లేశ్, సయ్యద్ జునైద్ అహ్మద్ , కె. వెంకటేష్ ఉన్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఈ జట్టుకు బొల్లికుంట వీసీపీఈ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సయ్యద్ యాసిన్ కోచ్‌గా, హనుమకొండలోని కనిష్క డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె. రాకేష్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు.


