లారీ, బస్సు మధ్యలో చిక్కుకున్న కారు
ములుగు రూరల్: జాతరకు వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన ఆదివారం మల్లంపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ నుంచి ములుగు వైపునకు వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు మల్లంపల్లి బస్టాండ్ ప్రాంతంలో బ్యాటరీ సమస్య తలెత్తి నిలిచింది. హనుమకొండ నుంచి మేడారం వస్తున్న భక్తుల కారు ఆగి ఉన్న బస్సును ఓవర్‌టెక్ చేస్తున్న క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు.. లారీ, బస్సు మధ్య చిక్కుంది. డ్రైవర్ చాకచక్యంగా లారీని నిలిపివేయడంతో కారులో ఉన్న వారికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. దీంతో జాతీయ రహదారిపై సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
మల్లంపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురైన కారు


