మార్గళి వ్రతం ఆచరిస్తే విష్ణు సాక్షాత్కారం
హన్మకొండ కల్చరల్: మార్గళి వ్రతం భక్తితో ఆచరించిన కోరికలు నెరవేరుతాయని, విష్ణు సాక్షాత్కారం కలుగుతుందని శ్రీగోదా మాధవ ఆధ్యాత్మిక ప్రార కేంద్రం నిర్వాహకులు, ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి పేర్కొన్నారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శ్రీగోదామాధవ ఆధ్యాత్మిక కేంద్రంలో ఆపదుద్దారకస్వామి వారిని ఆదివా రం పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం 11 గంటలకు 108 పాత్రల్లో పాయసం నివేదించారు. విష్ణుసహస్రనామ పా రాయణం, ఆపదుద్దారక పారాయణం చేశారు. కార్యక్రమంలో వెన్నపురెడ్డి రమణారెడ్డి–సరళ దంపతులు, భక్తులు పాల్గొన్నారు.


