అమ్మవారికి ఇన్ఫర్మేషన్ కమిషనర్ పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీనివాసరావు సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయమర్యాదలతో స్వాగతించారు. శ్రీనివాసరావు అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.
వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు ఆదివారం కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారుల సమక్షంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపా. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ చక్కటి కార్యక్రమం అని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
హన్మకొండ అర్బన్: బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన నృత్య స్రవంతి కూచిపూడి కళాక్షేత్రం 35వ వార్షికో త్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నృత్యస్రవంతి విద్యార్థుల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా గవర్నర్ కె.చంద్రశేఖర్ ప్రసంగించారు. కూచిపూడికి ఉన్న సంప్రదాయం, సాధన విలువను ఆ యన వివరించారు. అనంతరం నృత్య స్రవంతి కళాక్షేత్రంలో శిక్షణ పొందిన విద్యార్థులు చేసిన శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. లయ, భావ, అభినయాలతో సాగిన ప్రదర్శనలు కనులపండువగగా నిలిచాయి. సంప్రదాయ శాసీ్త్రయ నృత్యాన్ని సజీవంగా ఆవిష్కరించిన తీరు వీక్షకులను కట్టిపడేసింది. నృత్య స్రవంతి కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించగా, అధ్యక్షురాలు తాడూరి రేణుక పాల్గొన్నారు.
హన్మకొండ: హనుమకొండ మండలం పలివేల్పుల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెనిశెట్టి రవికుమార్ శాంతిసేవా పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో శనివారం రాత్రి అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. విద్య, సామాజిక, సాంస్కృతిక సేవా రంగాల్లో విశేష సేవలందించిన వారికి గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ కల్చరల్ యోగా ఎడ్యుకేషన్ అవార్డులు ప్రదానం చేసింది. ఈరంగంలో సేవలందిస్తున్న వెనిశెట్టి రవికుమార్‌ను శాంతిసేవా పురస్కారానికి ఎంపిక చేసింది. కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మల్కాజ్గిరి కోర్టు జడ్జి మధుసూదన్, గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ కల్చరల్ యోగా ఎడ్యుకేషన్ సంస్థ వ్యవస్థాపకుడు పల్లెపూల వెంకటరమణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
అమ్మవారికి ఇన్ఫర్మేషన్ కమిషనర్ పూజలు
అమ్మవారికి ఇన్ఫర్మేషన్ కమిషనర్ పూజలు


