ప్రజాప్రతినిధుల్లో సేవాగుణం ఉండాలి
● వినియోగదారుల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు మొగిలిచెర్ల సుదర్శన్
ఖిలా వరంగల్: ప్రజాప్రతినిధులు లాభాపేక్షలేకుండా ప్రజలకు సేవ చేయాలని వినియోగదారుల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు, దక్షిణాది రాష్ట్రాల సమాఖ్య జనరల్ సెక్రటరీ మొగిలిచెర్ల సుదర్శన్ అన్నారు. ఆదివారం వరంగల్ శివనగర్‌లోని సమాఖ్య జిల్లా కార్యాలయంలో వినియోగదారుల సమాఖ్య జిల్లా ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య నిర్వచనం, ప్రజల బాధ్యతపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుత ఓటు వినియోగం, ప్రజాస్వామ్య హక్కుల్ని, జరిగిన విధ్వంసాన్ని, జరగబోయే ప్రమాదాన్ని వివరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. న్యాయవాదులు యశ్వంత్‌కుమార్, రంగరాజు ఆనందరావు, రాయబారపు భిక్షపతి, బండి అనిల్‌కుమార్, బాలాజీ, ఏఐసీడబ్ల్యూసీ రాష్ట్ర అధ్యక్షుడు చిలువేరు ప్రవీణ్, మాజీ ఉద్యోగులు దిడ్డి లక్ష్మీనారాయణ, తిరునగరి లక్ష్మీనరసింహస్వామి, యం.ఉపేందర్, సమాఖ్య సభ్యులు కార్తీక్ మహేశ్, మధుకర్, ఫజల్ తదితరులున్నారు.


