మేడారంలో భక్తుల సందడి
ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తల్లులకు ఎత్తు బంగారం సమర్పించారు. చీర, సారె సమర్పించి తల్లులకు మొక్కులు చెల్లించారు. భక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. కాగా, ఆదివారం ఒక్క రోజే సుమారు 5 లక్షల మంది తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. – ఎస్‌ఎస్ తాడ్వాయి


