ఇక పురపోరు | - | Sakshi
Sakshi News home page

ఇక పురపోరు

Jan 12 2026 8:17 AM | Updated on Jan 12 2026 8:17 AM

ఇక పురపోరు

ఇక పురపోరు

ఇక పురపోరు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల సవరణ ఓ కొలిక్కి వచ్చింది. వార్డుల వారీగా సోమవారం ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా వెలువడనుంది. ఈనేపథ్యంలో.. ఉమ్మడి వరంగల్‌లో మున్సిపల్‌ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ పోరు ప్రతిష్టాత్మకం కాగా.. ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడిన నాటి నుంచి సమీకరణలు ప్రారంభించారు. ఫిబ్రవరి 14న ఎన్నికలు ఉంటాయని, ఈ నెల 20న నోటిఫికేషన్‌ వెలువడుతుందన్న ప్రచారం ఉంది. దీంతో ఎన్నికల నిర్వహణ విషయంలో స్వల్ప వ్యవధి మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలకు మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారైన మరుసటి రోజునే కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా పట్టణాల్లో అంతర్గత సమావేశాలకు శ్రీకారం చుట్టింది. బీఆర్‌ఎస్‌ సైతం ఇదే తరహాలో సీనియర్లతో సమావేశాలు నిర్వహిస్తూ మంతనాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 30కి పైగా స్థానాలు గెలిచిన బీజేపీ కూడా మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టిపెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు ఇటీవల పర్యటించారు. వామపక్షపార్టీలు సైతం ఎన్నికలకు ఏ తరహాలో ముందడుగు వేయాలనే విషయమై కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

ఆశావహుల్లో టెన్షన్‌

మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగితే రాజకీయ పార్టీల దృష్టి చైర్మన్‌, వార్డుల రిజర్వేషన్లపై పడనుండి. పాత 9 మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పడిన 3 కలిపి 12 చోట్ల ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రిజర్వేషన్లపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో ఏ మున్సిపాలిటీలో చైర్మన్‌ పదవి ఏ సామాజిక వర్గాన్ని వరిస్తుందో.. వార్డుల్లో తమకు రిజర్వేషన్‌ కలిసి వస్తుందో.. రాదోనన్న అనుమానాలు ఆశావహులను వెంటాడుతున్నాయి. కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇంకా రిజర్వేషన్లను తేల్చలేదు.

గెలుపే లక్ష్యంగా..

నోటిఫికేషన్‌ వెలువడడమే తరువాయి.. అవసరమైన జోరుని చూపించాలని బలాబలాలను లెక్కలు వేసుకుంటున్నాయి. తుది ఓటరు జాబితా వెలువడిన తర్వాత కులాల వారీగా ఓటర్లను ఆకట్టేకునేలా ప్రచారాన్ని నిర్వహించే వ్యూహాల రచనలో నిమగ్నమయ్యారు. వరుస విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చాలని అధికార కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఒప్పించి ఓట్లు పొందాలన్న ప్లాన్‌తో బీఆర్‌ఎస్‌, బీజేపీలున్నాయి.

రిజర్వేషన్లు తేలకముందే ఆశావహుల బాహాబాహీ

పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మున్సిపల్‌ ఎన్నికలు

12 మున్సిపాలిటీల్లో అభ్యర్థుల కోసం కసరత్తు

నేడు వార్డుల వారీగా ఫొటోలతో ఓటర్ల జాబితా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement