సీసీఆర్బీని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సీసీఆర్బీ కార్యాలయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదివారం సాయంత్రం తనిఖీ చేశారు. సెక్షన్ల వారీగా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, వారు నిర్వహిస్తున్న రికార్డులు, అందులో నమోదు చేసిన వివరాలను సంబంధిత సెక్షన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో అదనపు డీసీపీ రవి, ఏసీపీలు డేవిడ్ రాజు, జనార్దన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, సంజీవ్, మల్లయ్య, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్ రావు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.


