జాతీయస్థాయి ఖోఖో పోటీలు షురూ
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేడియంలో ఆదివారం 58వ సీనియర్ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్‌షిప్ మెన్ అండ్ ఉమెన్ క్రీడా పోటీలను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పలురాష్ట్రాల ఖోఖో ఫెడరేషన్, అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ యువత ప్రపంచస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని సూచించారు. దేశం మొత్తం కాజీపేట రైల్వే స్టేడియాన్ని చూస్తోందని, కాజీపేట నుంచి దేశానికి క్రీడాకారులను చూపిస్తున్న రాష్ట్ర ఖోఖో సంఘం ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గ్రామీణ క్రీడలు ఖోఖో, కబడ్డీలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఖోఖో క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం పక్షాన స్వాగతం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. క్రీడల శాక మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కాజీపేటలో నిర్వహిస్తున్న ఖోఖో పోటీలను దేశం మొత్తం చూస్తోందన్నారు. యువత క్రీడల్లో రాణించాలని, ఖోఖో, కబడ్డీ ప్రపంచస్థాయి క్రీడలుగా ఎదిగేందుకు కృషిచేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి 42 క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రీడలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఒలింపిక్ క్రీడాకారులుగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పారు. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుధాన్స్ మిట్టల్, జనరల్ సెక్రటరీ ఉప్‌కార్ సింగ్, ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఎస్.త్యాగి, గోవింద శర్మ, తెలంగాణ స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్‌రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్ చైర్మన్ ఎన్.శివసేనారెడ్డి తదితరులు మాట్లాడారు. జిల్లాలో స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ కోసం రూ.కోటిన్నర నిధులు విడుదల చేయాలని జంగా రాఘవరెడ్డి కోరగా క్రీడల మంత్రి హామీ ఇచ్చారు. అంతకు ముందు ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన 1,500 మంది క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 2008లో ఒలింపిక్స్‌లో అర్చరీ క్రీడలో రాణించిన వర్ధినేని ప్రణీతను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు. కాగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు 34 ఖోఖో మ్యాచ్‌లు ఆడారు. పోటీలు రాత్రి వరకు కూడా కొనసాగాయి.
కాజీపేట రైల్వే స్టేడియంలో
ప్రారంభించిన మంత్రులు
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి
పాల్గొంటున్న పలు రాష్ట్రాలకు చెందిన 1,500 మంది క్రీడాకారులు
జాతీయస్థాయి ఖోఖో పోటీలు షురూ
జాతీయస్థాయి ఖోఖో పోటీలు షురూ


