నేడు ‘డయల్ యువర్ డీఎం’
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. ఈనెల 31న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్–1 డిపో నుంచి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
హన్మకొండ: 2026–27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రతిపాదనలను జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ రూపొందించింది. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి బి.రవీందర్‌సింగ్ అధ్యక్షతన జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో నాబార్డ్ డీడీఎం ఎల్.చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారులు, జిల్లా మత్య్స శాఖ, పశు సంవర్థక శాఖ, మార్కెటింగ్ శాఖ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, శాస్త్రవేత్తలు, రీజినల్ బ్యాంక్ అధికారులు, ప్రగతిశీల రైతులు పాల్గొని వ్యవసాయంలో జరుగుతున్న ఖర్చులు, రైతుల అవసరాలు, పంటల వారీగా అయ్యే వ్యయాన్ని లెక్కించి, చర్చించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈప్రతిపాదనలు రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీకి పంపనున్నట్లు వరంగల్ డీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎండీ వజీర్ సుల్తాన్ తెలిపారు. రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత ఖరారైన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకు బ్యాంకులు పంటల వారీగా రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ జీఎం ఉషశ్రీ, డీజీఎం అశోక్, ఏజీఎం మధు, బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు.
కాజీపేట రూరల్: సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో అనకాపల్లి–వికారాబాద్ మధ్య కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. జనవరి 18న 21:45 గంటలకు అనకాపల్లిలో అనకాపల్లి–వికారాబాద్ (07416) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు వరంగల్, కాజీపేటకు చేరుకుంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు ఎలమంచిలి, తుని, అన్నవరం, సామల్‌కోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, రాయన్‌పాడ్, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లిలో హాల్టింగ్ కల్పించారు. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైలుకు రిజర్వేషన్ టికెట్ బుకింగ్ ప్రారంభించారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’


