షెల్టర్ హోమ్ పనులు పూర్తి చేయండి
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని షెల్టర్ హోమ్ లెస్ (పట్టణ నిరాశ్రయుల కేంద్రం) పనులు త్వరగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. మంగళవారం ఆస్పత్రి ఆవరణలోని వనాన్ని కమిషనర్ ఇంజనీర్లు, మెప్మా అధికారులతో కలిసి పరిశీలించారు.
పెట్ పార్కును సమర్థంగా నిర్వహించాలి..
హనుమకొండ బాలసముద్రంలోని పెట్ పార్కును కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. పార్కులో పేరుకుపోయిన వ్యర్థాలపై అసహనం వ్యక్తం చేశారు. ఆమె వెంట డిప్యూటీ కమిషనర్లు సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్, ఆర్‌ఐ కృష్ణారావు, ఈఈ రవికుమార్, టీఎంసీ రమేశ్, వార్డు ఆఫీసర్ నవ్య తదితరులు పాల్గొన్నారు.


