సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత బాధ్యతల స్వీకరణ

Nov 25 2025 6:54 AM | Updated on Nov 25 2025 6:54 AM

సెంట్

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత బాధ్యతల స్వీకరణ

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత బాధ్యతల స్వీకరణ నిబంధనలు తప్పక పాటించాలి 4 నుంచి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రజావాణికి 159 అర్జీలు

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా దార కవిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమెను సెంట్రల్‌ జోన్‌ పరిధి అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఆమె గతంలో హైదరాబాద్‌ సైబర్‌ విభాగంలో పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు.

ఎంజీఎం: జిల్లాలోని క్లినిక్‌లు, ఆస్పత్రులు క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం నిబంధనలకు లోబడి పని చేయాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య ఆదేశించారు. సోమవారం ఆయన నగరంలోని గౌతమ్‌ హాస్పిటల్‌, అభినయ్‌ క్లినిక్‌లను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన అనుమతి పత్రాలతో పాటు టారిఫ్‌ లిస్ట్‌, సందర్శిస్తున్న డాక్టర్ల వివరాలు, ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం హాస్పిటల్‌కు వచ్చిన పేషెంట్ల బంధువులతో మాట్లాడారు. మీరు సొంతంగా వచ్చారా? లేక ఎవరైనా పంపించారా? డాక్టర్‌ ఫీజు, ల్యాబ్‌, ఇతర పరీక్షలకు ఎంత తీసుకుంటున్నారు? వాటికి సంబంధించిన ధరల పట్టికను చూశారా? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరల పట్టికను పేషెంట్లకు కనిపించేలా ప్రదర్శించాలని నిర్వాహకులను ఆదేశించారు. అందించే సేవలకు ఎంత ఖర్చు అయ్యేదాన్ని బట్టి పేషెంట్లు వారికి అందుబాటులో ఉన్న క్లినిక్‌ లేదా ఆస్పత్రులకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. క్లినిక్‌, ఆస్పత్రులకు వచ్చే వారి వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవ్వకుండా చూడాలన్నా. నిర్వాహకులు పేషెంట్లకు మానవీయ కోణంలో చికిత్స అందించాలన్నారు.

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను డిసెంబర్‌ 4, 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు అడిషనల్‌ కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ డీఈఓ ఎ.వెంకటరెడ్డి సోమవారం తెలిపారు. ఇన్‌స్పైర్‌, సైన్స్‌ఫేర్‌ కలిసి హనుమకొండలోని సేయింట్‌ పీటర్స్‌ ఎడ్యూ స్కూల్‌లో ఈవైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2024–25 విద్యాసంవత్సరంలో ఇన్స్‌ఫైర్‌ అవార్డులకు ఎంపికైన విద్యార్థులు తమ ప్రాజెక్టు ఎగ్జిబిట్స్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాగా, ప్రధానాంశంగా వికసిత్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌ అనే ప్రధానంశంగా పలు ఉప ఇతివృత్తాల్లో ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించనున్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులకు డిసెంబర్‌ 5న ‘రెడ్యూసింగ్‌ పొల్యూషన్‌’ అనే ఇతివృత్తంపై సెమినార్‌ నిర్వహించనున్నట్లు, ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాసస్వామి తెలిపారు.

వినతులు స్వీకరించిన హనుమకొండ

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

హన్మకొండ అర్బన్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల్ని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డికి అందజేశారు. మొత్తం 159 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో అత్యధికంగా 35 ఇందిరమ్మ ఇళ్లకు, 21 గ్రేటర్‌ హనుమకొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు, 18 వినతులు హనుమకొండ ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించి ఉన్నాయి. మిగతావన్నీ ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించినవి. వినతులు పరిశీలించి ఆయా శాఖలకు బదిలీ చేసిన కలెక్టర్‌, దరఖాస్తుల పరిష్కారాన్ని వేగంగా పూర్తిచేయాలని, పెండింగ్‌లో ఉంచవద్దని శాఖాధికారులను ఆదేశించారు. అధికారులు తొలి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీఆర్డీఓ మేన శ్రీను పాల్గొన్నారు.

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత  బాధ్యతల స్వీకరణ1
1/2

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత బాధ్యతల స్వీకరణ

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత  బాధ్యతల స్వీకరణ2
2/2

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement