
ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలి
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈవిద్యాసంవత్సరం 2025–26 లో డిగ్రీ, పీజీ ప్రవేశాలు పొందాలని ఆ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు కోరారు. డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఆదివారం వెంకటేశ్వర్లు ఆ యూ నివర్సిటీ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణతో కలిసి హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల అధ్యయన కేంద్రాలను వేర్వేరుగా సందర్శిచారు. ప్రవేశాల పోస్టర్లను ఆవి ష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 30 వరకు అడ్మిషన్లకు గడువు ఉందని తెలి పారు. పూర్తి వివరాలకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. కేడీసీలో పోస్టర్ల ఆవి ష్కరణ కార్యక్రమంలో కేడీసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ అలువాల సంజీవయ్య, అధ్యాపకులు డాక్టర్ బి.వెంకట గోపీనాథ్, ఎం.సదానందం, సురేశ్, పూర్ణచందర్, దుర్గం రవి, రమేశ్ విద్యార్థులు పాల్గొన్నారు.