
బార్బరిక్ చిత్ర బృందం సందడి
హన్మకొండ చౌరస్తా: స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్‌రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. ఈనెల 29న విడుదల కానున్న బార్బరిక్ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోను ఆదివారం హనుమకొండలోని శ్రీదేవీ ఏషియన్‌మాల్‌లో ప్రదర్శించారు. షో కు విచ్చేసిన దర్శకుడు మోహన్ శ్రీవాత్సవ, నిర్మాత విజయపాల్‌రెడ్డి, నటి ఉదయభాను, నటీనటులు వశిష్ట, ఎన్.సింహా, సత్యంరాజేశ్, క్రాంతికిరణ్, సాంచీరాయ్ సినిమా ఎలా ఉందో ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. చిన్న సినిమాలను ఆదరించాలని కోరారు.
సినిమా చూసిన ఎమ్మెల్యే నాయిని
స్పెషల్ ప్రీమియర్ షో కు హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, చిత్ర బృందంతో కలిసి కాసేపు సినిమాను తిలకించారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి వెంట కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్, వద్దిరాజు వెంకటేశ్వర్లు, కరాటే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.