
అర్జీలు సత్వరమే పరిష్కరించండి
వరంగల్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తూ ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులకు సూచించారు. సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 115 ఫిర్యాదులు వచ్చాయి. గ్రేటర్ వరంగల్ పరిధి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కమిషనర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌లో ఇంజనీరింగ్ 20, హెల్త్ శానిటేషన్ 7, ప్రాపర్టీ ట్యాక్స్ (రెవెన్యూ) 17, టౌన్ ప్లానింగ్ 52, మంచి నీటి సరఫరా 14, ఎలకి్ట్రకల్ 2, జనరల్ 3తో కలిపి మొత్తం 115 అర్జీలు వచ్చినట్లు సెక్షన్ ఉద్యోగులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జీడబ్ల్యూఎంసీ కమిషనర్
అశ్విని తానాజీ వాకడే
ప్రజావాణికి 115 ఫిర్యాదులు