
వాహనదారుల సౌలభ్యం కోసం నీడతెరలు
మేయర్ గుండు సుధారాణి
వరంగల్: నగరంలోని వాహనదారుల సౌలభ్యం కోసం నీడతెరలను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. హనుమకొండ పరిధి అదాలత్ సిగ్నల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నీడ తెరలను శుక్రవారం మేయర్ శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రతిరోజూ ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయన్నారు. ఈ క్రమంలో హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో సిగ్నల్ పాయింట్స్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పుడు నిరీక్షించాల్సిన అవసరం ఉంటుందని, వాహనదారులకు ఎండనుంచి ఉపశమనం కోసం నీడ తెరలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హనుమకొండ ప్రాంతంలోని ప్రధాన కూడళ్లు అదాలత్ జంక్షన్, పోలీస్ హెడ్ క్వార్టర్, అశోక, ములుగు రోడ్డు, కాకతీయ యూనివర్సిటీ జంక్షన్లు, వరంగల్ ప్రాంతంలో పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, పోస్టాఫీస్ జంక్షన్‌తోపాటు అవసరం మేరకు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈ రవికుమార్, డీఈలు రాజ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, ఏఈ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.