
ఇంటర్ తర్వాత ఎటు..
ఇంజనీరింగ్..
ఇంటర్‌లో ఎంపీసీ చదివిన వారు ఇంజనీరింగ్ కోర్సుకు అర్హులు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులు/ ర్యాంక్ ఆధారంగా ఇందులో ప్రవేశం లభిస్తుంది. ప్రధానంగా ఈసీఈ, కంప్యూటర్స్ సైన్స్ విభాగాలు మేలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్‌తో కూడా మెరుగైన అవకాశాలు ఉంటాయంటున్నారు.
పిల్లల భవిష్యత్‌పై
తల్లిదండ్రుల ఆలోచన
● కోర్సుల ఎంపికపై తర్జనభర్జన
● విద్యార్థుల ఆసక్తి, ప్రణాళిక
ముఖ్యమంటున్న నిపుణులు
● అందుబాటులో రెగ్యులర్‌తోపాటు పలు వృత్తి విద్యా కోర్సులు
కామర్స్..
ప్రస్తుతం కామర్స్ కోర్సులకు మంచి భవిష్యత్ ఉంది. ఇంటర్‌లో ఎంఈసీ, సీఈసీ చదివిన వారు బీకాం కంప్యూటర్స్, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో చేరొచ్చు. దేశంలోని వివిధ ప్రైవేట్ కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఎన్నో జాతీయ బహుళ జాతి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఈ కోర్సుతో మెండుగా ఉన్నాయి.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో ఇకపై ఏ కోర్సులు చదివిస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆలోచనలో పడ్డారు తల్లిదండ్రులు. రెగ్యులర్ కోర్సులకు భిన్నంగా వృత్తి విద్య లేదా.. మరేదైనా కోర్సు.. మొత్తానికి తమ పిల్లలు తక్కువ సమయంలో అభివృద్ధిలోకి వచ్చేలా చదువు ఉండాలని తల్లిదండ్రుల ఆలోచన.. ఇలాంటి సమయంలో ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులు ఉంటాయి.. ఏ కోర్సుతో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనే అంశాలపై ప్రత్యేక కథనం.
– ఖిలా వరంగల్
బీఎస్సీ డిగ్రీ..
ప్రస్తుతం బీఎస్సీ డిగ్రీ చదివే వారికి క్యాంపస్ ఎంపికల ద్వారా మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇందులో ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంపీఈ, ఇండస్ట్రీయల్ కెమిస్ట్రీ జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ తదితర కోర్సులు ఉన్నాయి. ఇవి పూర్తి చేసిన వారు సులభంగా ఉద్యోగాలు సాధించొచ్చు.
వైద్య కోర్సులు..
ఇంటర్‌లో బైపీసీ చదవిన వారు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా వైద్య కోర్సులో ప్రవేశం పొందొచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఫార్మసీ, బీహెచ్‌ఎంఎస్, నర్సింగ్ వంటి కోర్సులు చేయొచ్చు. ఈకోర్సుల్లో చేసిన వారికి వివిధ ఉపాధి, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. సాంకేతిక కోర్సుల్లో మంచి మార్కులు పొందిన వారు ట్రిపుల్ ఐటీ, జేఈఈ, ఎన్‌ఐటీ రాసేందుకు అర్హులు. బిట్స్ పిలానిలో ప్రవేశం కోసం బీట్‌శాట్ రాయాలి. స్పేస్ సైన్స్ అభ్యసించాలంటే శాట్ రాయాల్సి ఉంటుంది.
న్యాయ కోర్సులు
ఇంటర్‌లో ఏ గ్రూపు చదివిన వారైనా ఐదేళ్ల లా కోర్సుకు అర్హులే.. లా సెట్ ద్వారా ఇందులో ప్రవేశం ఉంటుంది. ప్రస్తుతం వివిధ కంపెనీలు లా చదవిన వారిని ప్రాధాన్యతనిచ్చి కొలువులు కల్పిస్తున్నాయి. లీగల్ అడ్వైజర్స్‌గా కంపెనీల్లోనూ అవకాశం ఉంది. సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
కోర్సుల ఎంపికే కీలకం
విద్యార్థుల భవితకు కోర్సుల ఎంపిక కీలకం. తమ పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలనుకోవడం తల్లిదండ్రులు తప్పుకాదు. కానీ, పిల్లల ఆసక్తి తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదనేది నిపుణుల అభిప్రాయం. ఎక్కువశాతం తమకు అందుబాటులో ఉన్న కోర్సుల్లో పిల్లలను చేర్పిస్తున్నారు తప్పితే.. భిన్నమైన కోర్సుల్లో జాయిన్ చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో విద్యార్థులు భవిష్యత్‌లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావున ఇంటర్ తర్వాత విద్యార్థులు చదవాల్సిన కోర్సులపై కొంత పరిశోధన చేయడం లేదా విద్యావంతుల సలహాలు తీసుకోవడం మేలు.
వ్యవసాయ కోర్సులు..
వ్యవసాయ శాఖతోపాటు, వెటర్నరీ పరిశోధన రంగాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు ఇంటర్ బైపీసీ చేసిన విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఏబీఎస్సీలో అగ్రికల్చర్, హార్టీకల్చర్, అక్వాకల్చర్, సిరి కల్చర్, డెయిరీ టెక్నాలజీ, డెయిరీ మేనేజ్‌మెంట్ తదితర కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాలు పొందొచ్చు.
ఒకేషనల్ కోర్సులు
పలు ఒకేషనల్ (వృత్తి విద్య) కోర్సులు సైతం ఇంటర్ తర్వాత విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హోటల్ మేనేజ్‌మెంట్ చేయడం ద్వారా త్వరగా స్థిరపడే అవకాశం ఉంది. దీంతోపాటు యానిమేషన్, గ్రాఫిక్స్, మీడియా, జర్నలిజం, తదితర కోర్సుల ద్వారా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. కాగా, హైదరాబాద్, హనుమకొండ వంటి నగరాల్లో ఈ ఒకేషనల్ కోర్సులను అందించే కళాశాలలు, ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి.
విద్యార్థుల ఆసక్తి ముఖ్యమే..
విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది ఇంటర్ తర్వాత చదివే కోర్సు. ఈసమయంలో కోర్సు ఎంపిక, విద్యార్థుల ఆసక్తి ముఖ్యం. ఏ రంగం ఎంచుకుంటే భవిష్యత్ బాగుంటుందో ముందే నిర్ణయించుకోవాలి. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అంచనా వేసుకుని అడుగువేయాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
– సత్యనారాయణ,
నవోదయ రిటైర్డ్ ప్రిన్సిపాల్, వరంగల్
బీఏ డిగ్రీ..
పోటీ పరీక్షలకు బీఏ కోర్సు తోడ్పాటునిస్తుంది. సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు బీఏలో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, చరిత్ర, స్పెషల్ తెలుగు వంటి కోర్సుల ఎంతగానో తోడ్పడతాయి. డైట్ సెట్ ద్వారా డీఈడీ చేయొచ్చు. ఇంటర్ తర్వాత సీఏ, సీఎస్ (కంపెనీ సెక్రటరీ)లకు వాణిజ్య వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. పలు రకాల బ్యాంకు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఆర్‌ఆర్‌బీ ( రైల్వే), గ్రూపు–4, పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలను పొందొచ్చు.
బ్యాంకుల చేయూత
ప్రతిభావంతులకు ఆర్థిక అడ్డంకులు తొలగించేందుకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఉన్నత విద్యకు రూ.10 లక్షల వరకు ఇస్తున్నాయి. విదేశాల్లో చదువుకోవాలనే వారికి రూ.25 లక్షల వరకు రుణ సదుపాయం ఉంది. థర్డ్‌పార్టీ హామీతో రూ.7 లక్షలు, ఎటువంటి హామీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
●

ఇంటర్ తర్వాత ఎటు..

ఇంటర్ తర్వాత ఎటు..

ఇంటర్ తర్వాత ఎటు..

ఇంటర్ తర్వాత ఎటు..

ఇంటర్ తర్వాత ఎటు..

ఇంటర్ తర్వాత ఎటు..

ఇంటర్ తర్వాత ఎటు..

ఇంటర్ తర్వాత ఎటు..

ఇంటర్ తర్వాత ఎటు..

ఇంటర్ తర్వాత ఎటు..