కేజీబీవీల్లో 88.5 శాతం ఉత్తీర్ణత
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని 9 కేజీబీ వీల్లో 339 మంది విద్యార్థినులు ఇంటర్ సెకండియ ర్ పరీక్షలు రాయగా.. 300 మంది (88.5 శాతం) ఉత్తీర్ణత సాఽఽధించారని జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ సునీత తెలిపారు. ఆత్మకూరు కేజీబీవీ విద్యార్థిని ఎస్.హర్షిణి ఎంపీసీలో 1000 మార్కులకు 967 మా ర్కులు సాధించింది. ఐనవోలు కేజీబీవీ విద్యార్థిని ఎస్.నర్మద బైపీసీలో 1000 మార్కులకు 984 మా ర్కులు, సెకండియర్ ఎంపీహెచ్‌డబ్ల్యూలో బి.సాగరిక 1000 మార్కులకు 984 మార్కులు సాధించా రని పేర్కొన్నారు. ఫస్టియర్‌లో 85 శాతం ఉత్తీర్ణత ఇంటర్ ఫస్టియర్‌లో 463 మంది విద్యార్థినులు ప రీక్షలకు హాజరుకాగా 384 మంది ఉత్తీర్ణత (85శా తం)సాధించారు. కమలాపూర్ కేజీబీవీ విద్యార్థిని సీహెచ్.దివ్య ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులు, ఐనవోలు కేజీబీవీ విద్యార్థిని అశ్విని బైపీసీలో 440 మార్కులకు 431 మార్కులు సాధించారు. హసన్‌పర్తి కేజీబీవీ విద్యార్థిని జె.సాయిప్రియ ఫస్టియర్ ఎంపీహెచ్‌డబ్ల్యూలో 500 మార్కులకు 497 మార్కులు సాధించారని తెలిపారు.
కేజీబీవీల్లో 88.5 శాతం ఉత్తీర్ణత
కేజీబీవీల్లో 88.5 శాతం ఉత్తీర్ణత


