55 మంది హజ్‌యాత్రికులకు వ్యాక్సినేషన్
ఎంజీఎం: వ్యాక్సినేషన్‌తో హజ్ యాత్రికులకు ఎ లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని వరంగల్ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. ఐఎంఏహా ల్‌లో హజ్ యాత్రికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ సర్వర్ ఘాజీ సహకారంతో హజ్ యాత్రికులకు మంగళవారం వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ 55 మంది కి వ్యాక్సినేషన్ చేశామని, భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచి వచ్చిన నలుగురు హజ్ యాత్రికుల కు వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్, వైద్యులు ఆచార్య, జునైద్‌ఖాన్, కిరణ్, భరత్‌కుమార్, రహేలా తన్వీర్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, విద్యాసాగర్, రవీందర్, నితిన్‌రెడ్డి, సంజీవ్, సిబ్బంది పాల్గొన్నారు.
నకిలీ డాక్టర్‌పై కేసు నమోదు
రామన్నపేట: తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రార్ డాక్టర్ బాలయ్య, చైర్మన్ మహేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు నకిలీ డాక్టర్ బి.జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదు చేశారు. తెలంగాణ వైద్యమండలి అధికారుల తని ఖీ సమయంలో రామన్నపేటకు చెందిన ఆర్‌ఎంపీ జ్ఞానేశ్వర్ అర్హత లేకుండా ప్రజలకు స్టెరా యిడ్లు, యాంటీబయోటిక్స్‌ను అఽధికంగా ఇస్తున్న ట్లు గు ర్తించారు. ఎన్‌ఎంసీ చట్టం 34,54, టీఎస్‌ఎంపీఆర్ చట్టం 22కి ఈ చర్యలు వ్యతిరేకంగా ఉండడంతో మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదు చేసినట్లు మెడికల్ కౌ న్సిల్ ప్ర జాసంబంధాల కమిటీ చైర్మన్ వి.నరేశ్ తెలిపారు.


