ఆస్తుల సంరక్షణకే వక్ఫ్ చట్టం
హన్మకొండ చౌరస్తా: ఆస్తుల సంరక్షణకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చిందని సీబీఐ రిటైర్డ్ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. హనుమకొండ కాకాజీకాలనీలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో వక్ఫ్ చట్టంపై మంగళవా రం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ దేశంపై దండయాత్ర చేసిన ఘోరీ మొదటిసారి భారత్‌లో వక్ఫ్ తయారు చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత వక్ఫ్ పేరుతో ఔరంగజేబు చాలా ఆస్తులు సంపాదించి పెట్టారని వివరించారు. ట్రి పుల్ తలాక్ చట్టాన్ని తెచ్చినప్పుడు సైతం దే శంలో వ్యతిరేకత వచ్చిందని, తర్వాత తమ మేలుకోసమే చట్టమని గుర్తించిన వారందరూ స్వాగతించారని తెలిపారు. గోపాల్‌రావు ఠాకూర్ స్మారక సమితి, ప్రజ్ఞా భారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సీనియర్ పాత్రికేయుడు సుధాకర్, గోపాల్‌రావు ఠాకూర్ స్మారక సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు చామర్తి ప్రభాకర్, నిర్వాహకులు డాక్టర్ సమ్మిరెడ్డి, రాంచందర్, ఏపీ మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, మాజీ మేయర్ రాజేశ్వర్‌రావు, బీజేపీ నాయకులు ప్రదీప్‌రావు, రావు పద్మ, ప్రేమేందర్‌రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు.
నేడు ఎస్‌ఈతో ఫోన్ ఇన్
హన్మకొండ: విద్యుత్ సరఫరా, నూతన వి ద్యుత్ సర్వీస్‌ల మంజూరుపై ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతమ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు 7901628362 నంబర్‌కు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు అందించాలన్నారు.
సీబీఐ రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ


