
అవినీతి అధికారులకు శిక్షపడాలి
హన్మకొండ చౌరస్తా: లంచం తీసుకుంటూ పట్టుబ డిన అధికారులకు శిక్షపడేలా పటిష్ట చట్టాలు అమలు చేయాలని, అప్పుడే అవినీతి తగ్గుతుందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారా యణ అభిప్రాయపడ్డారు. జ్వాలా స్వచ్ఛంద సంస్థ, లోక్‌సత్తా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో లంచం ఆ శించిన అధికారులను ఏసీబీకి పట్టించిన పౌరులను బుధవారం సన్మానించారు. హనుమకొండలోని క ల్యాణి ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమానికి జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజం నుంచి లంచం అనే మహమ్మారిని సమూలంగా నిర్మూలించాలంటే రాజకీయాలు, చ ట్టాల్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. రూ. వందల కోట్లతో పోటీ చేసే ధోరణి పో వాలని, ఇటీవల హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడడం కలిచివేసిందన్నారు. ఏసీబీని ఆశ్రయించి అవినీతి అధికారులను పట్టించే యువత మ రింత ముందుకు రావాలన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెంది విజయ్, శివరాజ్, కమలాపూర్‌కు చెందిన గోపాల్ సన్మానించి ఒక్కొక్కరికి రూ.5వేల నగదు పురస్కారం అందజేశారు. లోక్‌సత్తా సంస్థ సలహాదారుడు కోదండరామారావు, జ్వాలా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్, అంజలీదేవి, పర్యావరణ ప్రేమికుడు ప్రకాశ్, సీకేఎం కళాశాల రిటైర్డ్ అధ్యాపకుడు సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
లోక్‌సత్తా వ్యవస్థాపకుడు
జయప్రకాశ్ నారాయణ
ఏసీబీకి పట్టించిన పౌరులకు సన్మానం