హన్మకొండ కల్చరల్: వరంగల్‌కు చెందిన ఆగమ సామ్రాట్, భద్రకాళి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, అర్చకుడు భద్రకాళి శేషు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి ఆగమ ద్యుమణి బిరుదు అందుకున్నారు. విశ్వవిద్యాలయం వార్షికోత్సవాన్ని వైస్‌చాన్స్‌లర్ జీఎస్ ఆర్ కృష్ణమూర్తి అధ్యక్షతన మంగళవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దేశంలోని నిష్ణాతులైన పలువురు పండితులకు పురస్కారాలు అందించి సన్మానించారు. బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్త ఎల్‌ఎన్ రాఘవేంద్ర ముఖ్య అతిథిగా హాజరై భద్రకాళి శేషుకు ఆగమ ద్యుమణి బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శేషుకు భద్రకాళి దేవాలయ ఈఓ శేషుభారతి, సిబ్బంది, వరంగల్ సంగీత విద్వత్ గానసభ, అర్షధర్మరక్షణ సంస్థ సభ్యులు అభినందనలు తెలిపారు.