
సన్మానాలు.. సత్కారాలు
హన్మకొండ: తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మ న్ బొర్ర జ్ఞానేశ్వర్‌ను ము దిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. ఆదివా రం హనుమకొండ పర్యట నకు వచ్చిన ఆయనను హ నుమకొండలోని రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోషియేషన్–తెలంగాణ రాష్ట్ర కమిటీ మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్, నాయకులు.. జ్ఞానేశ్వర్‌ను సన్మానించి, పెద్దమ్మతల్లి చిత్రపటాన్ని బహూకరించారు. బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ కార్పొరేషన్ నిధులను ప్రతి జిల్లాకు పంచి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, ఆయా సంఘాల నాయకులు పొన్నం రాజు, రాజబోయిన రాజన్న, వినోద్ కుమార్, పల్లెబోయిన అశోక్, పులి రజనీకాంత్, రాజకుమార్, రాజన్న, అశోక్, కుమార్, చిరంజీవి, ఎన్.రాజు, రామకృష్ణ, భాస్కర్, సమ్మయ్య, రమేష్, రవీందర్, కృష్ణ, శ్యామ్, వినోద్, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
ఆలయ చైర్మన్‌కు..
హసన్‌పర్తి: ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఆరెల్లి వెంకటస్వామి దంపతులను ఆదివారం ఘనంగా సన్మానించారు. వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో వినాయక పరపతి సంఘం(1989–90 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్) ఆధ్వర్యంలో ఈకార్యక్రమం నిర్వహించా రు. సంఘం అధ్యక్షుడు గుడికందుల సురేష్, కార్యదర్శి యాదగిరి, వంశీ, నాగేందర్, రవి, కిరణ్, సంపత్, కుమారస్వామి, రమేష్ పాల్గొన్నారు.
సత్కారం
ఖిలా వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమాఖ్య అధ్యక్షు డు వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన మొగి లిచెర్ల సుదర్శన్ 34 సంవత్సరాలుగా వినియోగదా రుల విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఈమేరకు ఆదివారం హిమాచల్ సిమ్లాలో జరిగిన జాతీ య సమాఖ్య సమావేశంలో సుదర్శన్‌కు జాతీయ సమాఖ్య చైర్మణ్ డాక్టర్ అనంతశర్మ, ఎంపీ భూపేంద్ర కశ్యాప్ మెమోంటోను అందజేసి సత్కరించారు.