
రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులు ప్రారంభించాలి
మామునూరు: స్మార్ట్ సిటీలో భాగంగా మంజూరైన రూ.25లక్షల నిధులతో 43వ డివిజన్ గణేష్‌నగర్ కాలనీలో రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదివారం స్థానికులు నిరసన తెలిపారు. మంజూరైన అభివృద్ధి పనులు తక్షణమే చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు కలిసి వినతిపత్రాలు అందజేసినా.. పట్టింపులేదని వాపోయారు. ఈ కాలనీకి మంజూరైన నిధులను ఇతర కాలనీలకు మళ్లించొద్దని స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానిక కార్పొరేటర్ కాలనీపై వివక్షత చూపుతున్నాడని ఆరోపించారు. కాలనీలో మట్టి రోడ్లు మరింత గుంతలు పడి ఆధ్వానంగా తయారయ్యాయని వాపోయారు. అధికారులు స్పందించి కాలనీ కి మంజూరైన నిధులతో పనులు చేపట్టాలని కాలనీ ప్రతినిధి ఉమ్మగాని ఉమేష్‌గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో గంట సుమన్, చంద్రమౌళి పాల్గొన్నారు.
గణేష్‌నగర్‌లో స్థానికులు నిరసన