
ఉత్సాహంగా రూబిజెస్ట్ – 2025
ర్యాంప్ వాక్, నృత్యం చేస్తున్న విద్యార్థినులు
● కేయూ మహిళా ఇంజనీరింగ్
కళాశాలలో నిర్వహణ
● ఆకట్టుకున్న విద్యార్థినుల ర్యాంప్ వాక్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రూబిజెస్ట్– 2025లో భాగంగా శుక్రవారం థిమ్ డే వేడుకలను ఉత్సాహంగా కొనసాగాయి. ప్రోగ్రాం కన్వీనర్ సాయి తరుణ్, వివిధ ఆర్గనైజర్ల ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆడిటోరియంలో కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి మహిళా అధ్యాపకులు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. అంతే కాకుండా వారు ఇచ్చిన సోలో, గ్రూప్ డ్యాన్స్‌లు ఆకర్షణగా నిలిచాయి. జాతీయ స్థాయిలో ఉన్న వివిధ ప్రాంతాల, సంప్రదాయ నత్య రీతులవారు ధరించే దుస్తులను ధరించి కళాశాల విద్యార్థినులు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ర్యాంప్ వాక్ ప్రదర్శనలో నిలిచిన బీటెక్ ఈసీఈ విభాగం ప్రథమ సంవత్సరం విద్యార్థిని సుదూప్తికి ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌రెడ్డి బహుమతి అందజేశారు.

ఉత్సాహంగా రూబిజెస్ట్ – 2025