వరంగల్ అర్బన్: నగర వ్యాప్తంగా కమర్షియల్ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్ల కోసం ప్రత్యేకంగా 14 బృందాలను ఏర్పాటు చేసినట్లు బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. బుధవారం కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజారోగ్య విభాగ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కమర్షియల్ ట్రేడ్ వసూళ్లను వేగవంతం చేయడానికి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ అధికారులు జవాన్లతో కాజీపేట సర్కిల్‌కు 7, కాశిబుగ్గ సర్కిల్‌కు 7 బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. కేటాయించిన ప్రాంతాల్లో ప్రతీ రోజు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న కమర్షియల్ షాపులపై ప్రత్యేక దృష్టి సారించి ట్రేడ్ వసూళ్లు జరిపేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రవీందర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఐటీ మేనేజర్ రమేశ్, శానిటరీ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
నూతన ఓటర్ల నమోదుకు
సహకరించాలి
నూతన ఓటర్ల నమోదుకు రాజకీయ పార్టీలు సహకరించాలని వరంగల్ (తూర్పు) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పలు సూచనలి చ్చారు. అర్హులు తప్పకుండా ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కుసుమ శ్యామ్‌సుందర్, బాకం హరిశంకర్, రజనీకాంత్, ఎండీ హెబ్‌దుల్ల తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే
కఠిన చర్యలు
సమీక్షలో కమిషనర్
అశ్విని తానాజీ వాకడే