● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి
● ఘనంగా ఇంజనీరింగ్ కాలేజీ స్పోర్ట్స్
అండ్ కల్చరల్ డే
కేయూ క్యాంపస్ : ప్రతిభతోనే ఇంజినీరింగ్‌లో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కూడా పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. సోమవారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డేను ఘనంగా నిర్వహించారు. అతిథులు జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఇంజినీరింగ్ యువత 40శాతం మంది ఉద్యోగ, ఉపాధి రంగాల్లో దూసుకుపోతున్నారని తెలిపారు. జాతీయ హాకీ జట్టు రిటైర్ట్ కోచ్ మధుచరణ్ మాట్లాడుతూ యువత సక్సెస్‌కు చదువుతోపాటు క్రీడలు కూడా అత్యంత ప్రాధాన్యత వహిస్తాయని తెలిపారు. పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రమణ మాట్లాడారు. వివిధ క్రీడల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కల్చరల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలతోపాటుగా ఆధునిక డ్యాన్స్‌లతో హోరెత్తించారు. అధ్యాపకులు సీహెచ్ రాధిక, ఆసిం ఇక్బాల్, వి.మహేందర్, శ్రీధర్ కుమార్, సుమలత, దాసరి శైలజ, రాజేశ్వరి, పర్వీన్,శిరీష బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.