ఉమ్మడి వరంగల్‌.. ఎవరి వ్యూహాలు వారివే

- - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఈనెల 15న ముగియగా.. సుమారు 13 రోజులపాటు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సాగించారు. నేతలు చివరి ప్రయత్నంగా ప్రలోభాలకు తెరలేపి, ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టజెబుతున్నారని సమాచారం. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి 12 నియోజకవర్గాల నుంచి 36 మంది పోటీలో ఉన్నా రు. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య నువ్వా నేనా? అన్నట్లు పోటీ సాగుతుండగా.. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు, శ్రేణులు రంగంలోకి దిగగా.. మరోవైపు ఎలాగైనా సత్తా చాటాలని స్వతంత్రులు పావులు కదుపుతున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో నేతలు, అభ్యర్థులు తమ చివరి వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చివరిరోజున ఉమ్మడి జిల్లాలో సభలు, సమావేశాలు, బైక్‌ ర్యాలీలు, కులసంఘాల భేటీలతో పట్టభద్ర ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. గురువారం పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా పోలింగ్‌ చేయించుకునేలా కసరత్తు చేస్తున్నారు.

ఓరుగల్లు ప్రచారంలో అగ్రనేతలు..
ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అక్టోబర్‌ 16న ఉమ్మడి వరంగల్‌లో తొలి ప్రచార సభను జనగామలో నిర్వహించిన సీఎం కేసీఆర్‌ అప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించారు. అక్టోబర్‌ 18న ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, కేంద్రమంత్రులు అమిత్‌షా, అనురాగ్‌ ఠాకూర్‌, అశ్వినికుమార్‌ చౌబే తదితరులు ఉమ్మడి వరంగల్‌లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. 27న ప్రధాని నరేంద్రమోదీ మహబూబాబాద్‌లో ప్రచారం నిర్వహించారు.

కర్ణాటక, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా పార్టీల తరఫున ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం సీఎం కేసీఆర్‌ అన్ని నియోజకవర్గాల్లో తిరగ్గా.. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు క్యాంపెయిన్‌ నిర్వహించారు. ధర్మసాగర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌లలో డీకే శివకుమార్‌, రేవంత్‌రెడ్డి, విజయశాంతి పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో బీఎస్‌పీ పక్షాన ఆ పార్టీ అధినేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రచారం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణ మాదిగ బీజేపీకి మద్దతుగా ప్రచారసభల్లో పాల్గొన్నారు. మొత్తంగా 13 రోజుల పాటు పోటాపోటీగా సాగిన ప్రచారం, డీజేలు, మైకుల మోత మంగళవారం సాయంత్రం నిలిచింది.

ఎవరి వ్యూహాలు వారివే..
ఉమ్మడి వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా 216 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా వరంగల్‌ తూర్పు నుంచి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అత్యల్పంగా భూపాలపల్లి నుంచి 9 మంది ఉన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన 36 మంది 12 సెగ్మెంట్లలో పోటీ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌లో మొత్తం 29,74,631 ఓటర్లుండగా.. 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు వారు 14,70,458 మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో యువ, నవ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో సాగుతుండగా.. ఆ ఓటర్లను ఆకట్టుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి.

ఆరు జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో రోజుకోరీతిలో ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య ప్రచారం పోరు రసవత్తరంగా సాగింది. ఎట్టకేలకు ప్రచార ఆర్భాటానికి మంగళవారం సాయంత్రం తెరపడడంతో రాత్రి నుంచి డబ్బులు, మద్యం, కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. కాగా.. నగదు, మద్యం భారీగా పంపిణీ జరుగుతుందన్న ప్రచారం మేరకు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 24 చెక్‌పోస్టుల ద్వారా సుమారు రూ.12 కోట్ల మేరకు నగదు, మద్యం, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు పెట్రోలింగ్‌ ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చారు.

 

Read latest Hanamkonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

29-11-2023
Nov 29, 2023, 14:03 IST
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. జిల్లా అంతటా పోటీ చేసి గెలుపొందారు....
29-11-2023
Nov 29, 2023, 13:41 IST
పాలకుర్తి: ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో స్థానికేతరులు పాలకుర్తి నియోజకవర్గాన్ని వీడాలని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎన్‌ఆర్‌ఐ ఝాన్సీరెడ్డికి...
29-11-2023
Nov 29, 2023, 12:30 IST
సుజాతనగర్‌: తెలంగాణ ఏర్పడ్డాక ఎవరు గెలుస్తారోనని దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారు ఆసక్తి కనబరిచారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి...
29-11-2023
Nov 29, 2023, 12:18 IST
‘పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు. నల్లగొండను కేసీఆర్‌ దత్తత తీసుకుని ఒక్క రోడ్డు వేసి ఇంకా దత్తత అయిపోలేదని...
29-11-2023
Nov 29, 2023, 12:11 IST
సాక్షి, కరీంనగర్‌: ‘గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు. కరీంనగర్‌లో నేను చేసిన అభివృద్ధిపై చర్చించే దమ్ములేని వ్యక్తి నాపై దొంగ వీడియోలు...
29-11-2023
Nov 29, 2023, 11:14 IST
ఇల్లందకుంట/వీణవంక/కమలాపూర్‌: ‘ఓ వ్యక్తిని నమ్మి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నియోజకవర్గానికి ఒరగబెట్టిందేంటీ.. కేసీఆర్‌ దయతో మంత్రి పదవి అనుభవించిండు.. కానీ...
29-11-2023
Nov 29, 2023, 10:16 IST
‘‘కాకిని ఆదర్శంగా తీసుకుంటే ఓటును సరిగా వేయొచ్చు’’ అంటూ విలక్షణంగా  సెలవిచ్చారు స్వామి ఎలక్షనానంద అలియాస్‌ స్వామి సలక్షణానంద. ‘‘అదెలా...
29-11-2023
Nov 29, 2023, 09:42 IST
‘సాగర్‌ నియోజకవర్గ ప్రజలే నా బలం.. బలగం. నేను ప్రచారానికి వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి...
29-11-2023
Nov 29, 2023, 09:38 IST
సాక్షి, హైదరాబాద్‌: ఓటరు నాడి పసిగట్టడం నాయకులకు పజిల్‌గానే ఉంది. గుమ్మం దాకా వెళ్లినా.. తాయిలాలు పంచినా.. ఆ ఓటు...
29-11-2023
Nov 29, 2023, 09:10 IST
నర్సాపూర్‌: ఈ ఎన్నికలలో గెలిచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడగానే మెదక్‌ జిల్లాను సిరిసిల్ల జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌లో కలుపుతామని,...
29-11-2023
Nov 29, 2023, 08:49 IST
కొడంగల్‌: నియోజకవర్గ ప్రజల తీర్పు విభిన్నం. మార్పు కావాలనుకుంటే ఎలాంటి వారికైనా పరాభవం తప్పదు. ఇది గతంలో నిరూపితమైంది. 1983లో...
29-11-2023
Nov 29, 2023, 08:33 IST
ఈసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం దుమ్ము రేపింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్‌ఎస్, ఎలాగైనా తెలంగాణలో అధికారం కోసం...
29-11-2023
Nov 29, 2023, 07:51 IST
కల్వకుర్తి టౌన్‌: అసెంబ్లీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పోలింగ్‌కు ముందు ఓటర్లు కొన్ని...
29-11-2023
Nov 29, 2023, 05:33 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం ముగియడంతో వచ్చే రెండురోజుల పాటు అనుసరించాల్సిన వ్యూహంపై భారత్‌...
29-11-2023
Nov 29, 2023, 05:18 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌/ సాక్షి, సిద్దిపేట: ‘కాంగ్రెస్‌ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఆ పార్టీ నేతలు  చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం...
29-11-2023
Nov 29, 2023, 04:58 IST
సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్‌ పాములాంటి వాడు. ఓటు వేశారో మిమ్మల్నే కాటు వేస్తాడు. కేసీఆర్‌ను నమ్మడం అంటే పాముకు పాలుపోసి...
29-11-2023
Nov 29, 2023, 04:52 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ కోసం రాజస్తాన్‌ తరహాలో పథకాన్ని వర్తింప...
29-11-2023
Nov 29, 2023, 04:44 IST
సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: తెలంగాణలో మార్పు కావాలని, ఆ మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ కి ఓటేయాలని ఏఐసీసీ అగ్రనేత...
29-11-2023
Nov 29, 2023, 04:44 IST
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ సమీపిస్తుండటంతో నగర పోలీసు విభాగం అప్రమత్తమైంది. బుధవారం ఉదయం నుంచి...
29-11-2023
Nov 29, 2023, 04:42 IST
హైదరాబాద్: గ్రీన్‌ చాలెంజ్‌, బకెట్‌ చాలెంజ్‌ తరహాలోనే ఓటు చాలెంజ్‌కు కాలనీ సంఘాలు తెరలేపాయి. గ్రేటర్‌లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు,... 

Read also in:
Back to Top