ఇంటింటికీ విద్యుత్‌ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ విద్యుత్‌ ఉద్యోగులు

Jan 13 2026 7:20 AM | Updated on Jan 13 2026 7:20 AM

ఇంటిం

ఇంటింటికీ విద్యుత్‌ ఉద్యోగులు

ఇంటింటికీ విద్యుత్‌ ఉద్యోగులు

హన్మకొండ: విద్యుత్‌ వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేసేందుకు, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు వినూత్న కార్యక్రమం చేపట్టాయి. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో అధికారులు, ఉద్యోగులు వినియోగదారులను కలువనున్నారు. గృహజ్యోతి, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులను కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంక్రాంతి శుభా కాంక్షల లేఖలు అందించేందుకు రంగం సిద్ధం చేశా రు. ఈ నెల 13 నుంచి పంపిణీ చేసేందుకు ఎన్పీడీసీఎల్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. వినియోగదారుడి పేరు, సర్వీస్‌ కనెక్షన్‌ నంబర్‌తో వ్యక్తిగతంగా అడ్రస్‌ చేసిన ఈ లేఖలను టీజీఎన్పీడీసీఎల్‌ అధికారులు, సిబ్బంది స్వయంగా వినియోగదారు ల గృహాలను సందర్శించి అందజేయనున్నారు.

ప్రత్యేక చొరవ..

టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధి మొత్తం 52,82,498 మంది గృహ జ్యోతి లబ్ధిదారులు, 30,03,813 మంది వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు నేరుగా లేఖలు అందివ్వనున్నారు. గృహజ్యోతి లబ్ధిదారులు హనుమకొండ సర్కిల్‌లో 1,30,199 మంది. వరంగల్‌లో 1,31,726, జేఎస్‌ భూపాలపల్లి సర్కిల్‌లో 57,016, ములుగులో 40,859, జనగామలో 94,372, మహబూబాబాద్‌లో 1,08,466 మంది లబ్ధిదారులున్నారు. వినియోగదారులు, అధికా రుల మధ్య సత్సంబంధాలను మెరుగుపర్చడం, భవిష్యత్‌లో మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని విద్యుత్‌ అధికారులు తెలిపారు. ప్రభుత్వం తమపై చూపిస్తున్న ఈ ప్రత్యేక చొరవ, ప్రజల సంక్షేమంపై ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా వినియోగదారులు భావిస్తున్నారు.

వినియోగదారులతో సత్సంబంధాలు..

సంక్రాంతి శుభాకాంక్షల లేఖల ద్వారా వినియోగదారులతో సంబంధాలు మెరుగుపడుతాయి. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్‌తో వినియోగదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అధికారులు, ఉద్యోగులు వినియోగదారులకు నాణ్యమైన మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

– పి.మధుసూదన్‌రావు, ఎస్‌ఈ,

హనుమకొండ

వినూత్న కార్యక్రమం..

ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం ద్వారా ప్రభుత్వం, విద్యుత్‌ పంపిణీ సంస్థలు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. వినియోగదారులపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తుంది. సంస్థకు వినియోగదారుడే ముఖ్యం. వినియోగదారుడికి మెరుగైన సేవలందించడం అధికారులు, ఉద్యోగుల బాధ్యత.

– కె.గౌతంరెడ్డి, ఎస్‌ఈ, వరంగల్‌

టీజీ ఎన్పీడీసీఎల్‌ వినూత్న కార్యక్రమం

గృహజ్యోతి వినియోగదారులకు

లేఖల పంపిణీ

ఎమ్మెల్యే నాయినికి శుభాకాంక్షల లేఖ

విద్యుత్‌ శాఖలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాసిన సంక్రాంతి శుభాకాంక్షల లేఖను టీజీ ఎన్పీడీసీఎల్‌ అధికారులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి అందించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్‌రావు, హనుమకొండ టౌన్‌ డీఈ జి.సాంబ రెడ్డి, ఏడీఈలు ఇంద్రసేనారెడ్డి, మల్లయ్య ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించి సంక్రాంతి శుభాకాంక్షల లేఖను అందజేశారు.

ఇంటింటికీ విద్యుత్‌ ఉద్యోగులు1
1/2

ఇంటింటికీ విద్యుత్‌ ఉద్యోగులు

ఇంటింటికీ విద్యుత్‌ ఉద్యోగులు2
2/2

ఇంటింటికీ విద్యుత్‌ ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement