డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
వరంగల్ లీగల్: జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు ‘బాలికల హక్కుల రక్షణ, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అంతమొందించడం’ అంశంపై సోమవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించినట్లు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ తెలిపారు. ఈవ్యాసరచన పోటీలో ఆదర్శ లా కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కళాశాల నుంచి 40 మంది న్యాయ విద్యార్థులు పాల్గొన్నట్లు వివరించారు. ప్రతిభ కనబర్చిన వారికి ప్రఽథమ, ద్వితీయ బహుమతులు గణతంత్ర దినోత్సవం రోజున అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్, తదితరులున్నారు.
విద్యారణ్యపురి: టెన్త్ విద్యార్థులకు ఈఏడాది ఫిబ్రవరి 17 నుంచి 24వ తేదీ వరకు ప్రీ–ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు డీఈఓలను ఆదేశించారు. ప్రీ–ఫైనల్ పరీక్షల టైంటేబుల్‌ను కూడా ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫిబ్రవరి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 19న థర్డ్ లాంగ్వేజ్, 20న మేథమెటిక్స్, 21న ఫిజికల్ సైన్స్, 23న బయాలాజికల్ సైన్స్, 24న సోషల్ స్టడీస్ నిర్వహించనున్నారు. ఈమేరకు సంబంధిత పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్ర రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్‌యూపీపీ టీఎస్) వరంగల్ జిల్లా నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఆర్‌యూపీపీటీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కక్కెర్ల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా సూరం ఇంద్రసేనారెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం వీరికి నియామక పత్రాన్ని ఆర్‌యూపీపీ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహులు, ప్రధాన కార్యదర్శి భత్తిరాజు శశియాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బెజ్జం సునీల్‌కుమార్ అందజేశారు.
వరంగల్ క్రైం: స్వామి వివేకానందుడి మాటలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని అదనపు డీసీపీ సురేశ్‌కుమార్ తెలిపారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు సిబ్బంది వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా అడిషనల్ డీసీపీ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ.. దేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానందుడని పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో అదనపు డీసీపీలు ప్రభాకర్‌రావు, శ్రీనివాస్, ఏసీపీలు డేవిడ్ రాజు, జాన్ నర్సింహులు, నాగయ్య, అంతయ్య, ఆర్‌ఐలు స్పర్జన్ రాజ్, శ్రీధర్, సతీశ్, చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ మల్లయ్య, ఆర్‌ఎస్‌ఐ శ్రవణ్‌కుమార్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఎఫ్‌ఏసీ డీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ ఈనెల 13 నుంచి 18వరకు సెలవుపై వెళ్తున్నారు. కేరళలోని అయ్యప్పస్వామి దర్శనానికి సెలవుపెట్టి అధికారికంగా అనుమతి పొందారు. గిరిరాజ్‌గౌడ్ సెలవులో ఉన్న సమయంలో విద్యాశాఖకు సంబంఽధించిన బాధ్యతలను డీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఏసీజీఈ) బి.భువనేశ్వరి, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్‌మోహన్ ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయన తిరిగి విధుల్లో చేరే వరకు వీరిరువురు ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు సంబంధిత అధికారులు సోమవారం తెలిపారు.
డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు


