గ్రీవెన్స్ ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన వినతుల పరిష్కారానికి అధికారులు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆమె నేరుగా వినతులు స్వీకరించి వారు చెప్పిన అంశాలను ఓపిగ్గా విన్నారు. ఈసందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పలు మండలాల తహసీల్దార్లతోనూ ప్రజావాణి ఆర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 110 అర్జీలను స్వీకరించినట్లు, అధికారులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వై.వి గణేశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, అధికారులు పాల్గొన్నారు.
భూసమస్యలు పెండింగ్ ఉండొద్దు
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: భూ సమస్యలు ఎట్టి పరిస్థితిలో పెండింగ్‌లలో ఉంచొద్దని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె వినతులు స్వీకరించారు. మొత్తం 129 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీడబ్ల్యూఓ రాజమణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నన్ను పట్టించుకోవడం లేదు..
నాకు ముగ్గురు కుమార్తెలు. కుమారుడు లేకపోతే బంధువుల అబ్బాయిని దత్తత తీసుకున్న. నా భర్త ఉద్యోగం కుమారుడికి ఇప్పించా. ప్రస్తుతం నా యోగక్షేమాలు చూసుకోవట్లేదు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. న్యాయం చేయాలి.
– ఎ.సమ్మక్క, పైడిపల్లి, వరంగల్
గ్రీవెన్స్ ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలి
గ్రీవెన్స్ ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలి


