
మాట్లాడుతున్న గంగు ఉపేంద్రశర్మ
హన్మకొండ కల్చరల్ : సాధన చేస్తేనే ప్రావీణ్యం పొందవచ్చని.. ఆగమ పునఃశ్చరణ తరగతులు అర్చకులకు ఎంతో ఉపయోగపడుతాయని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపంలో దూపదీప నైవేద్య(డీడీఎన్) ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చకులకు ఏర్పాటు చేసిన పునఃశ్చరణ తరగతులు కొనసాగుతున్నాయి. సోమవారం ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వేదపండితులు పాంచరాత్ర, వైఖాసన ఆగమాలపై తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీపాంచరాత్ర ఆగమం శ్రీమన్నారాయణుడే ఉద్బోధించాడని, వైఖాసన ఆగమం విఖనస ఋషిచే వివరించబడిందన్నారు. కార్యక్రమంలో కృష్ణయజుర్వేద పండితులు గుదిమెళ్ల విజయకుమారాచార్యులు, చాత్తాద వైష్ణవ రాష్ట్ర నాయకుడు వరియోగుల శ్రీనివాసస్వామి, దేవాదా యశాఖ పరిశీలకుడు సంజీవరెడ్డి, అనిల్, విజయ్ పర్యవేక్షించారు. భద్రకాళి దేవాలయం ఆధ్వర్యంలో అర్చకులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు.
గంగు ఉపేంద్రశర్మ
కొనసాగుతున్న అర్చక శిక్షణ తరగతులు