
బల్దియా ప్రధాన కార్యాలయంలో కంప్యూటర్ విభాగాన్ని తనిఖీ చేస్తున్న మేయర్ సుధారాణి
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు ఇంకా ఎన్నాళ్లు చేస్తారని నగర మేయర్ గుండు సుధారాణి అసహనం వ్యక్తం చేశారు. శనివారం బల్దియా ఆవరణలో నిర్మాణంలో ఉన్న పనులను మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. పనుల్లో ఆశించినంత పురోగతి కనిపించడం లేదన్నారు. భవనం ఫినిషింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఐసీసీలో దశల వారీగా అన్ని కంపోనెంట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బల్దియా పరిపాలన భవన పనుల్ని త్వరితగతిన చేపట్టాలన్నారు. అనంతరం జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలోని ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళికా విభాగాల కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు.
విజయవంతం చేయాలి..
‘వేస్ట్ టు వండర్’ (చెత్త నుంచి అద్భుత పరికరాలు, ఉత్పత్తుల తయారీ) పోటీలను విజయవంతం చేయాలని మేయర్ సుధారాణి కోరారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా చెత్త నుంచి పరికరాలు, ఉత్పత్తులు, వివిధ వస్తువులు తయారు చేసే వారికి బల్దియా తరఫున నగదు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు బల్దియాలో తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. సెయింట్ పీటర్ స్కూల్ విద్యార్థులు దేశ పటం ఆకారంలో మధ్యలో జీడబ్ల్యూఎంసీ అక్షరాలు కనిపించేలా కూర్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, ఈఈ రాజయ్య, డీఈ రవికుమార్, సీఎంహెచ్‌ఓ రాజేశ్, శానిటరీ సూపర్‌వైజర్లు సాంబయ్య, భాస్కర్, నరేందర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
వేగం పెంచి, ప్రారంభోత్సవానికి
సిద్ధం చేయండి
నగర మేయర్ గుండు సుధారాణి
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పరిశీలన