భూ అభ్యంతరాలపై సత్వరం చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

భూ అభ్యంతరాలపై సత్వరం చర్యలు తీసుకోవాలి

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: భూ సమీకరణపై అందుతున్న అభ్యంతరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ అధికారులను ఆదేశించారు. సీఆర్‌డీఏ రెండవ విడత భూ సమీకరణపై స్థానిక కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నిడమర్రు, నవులూరులో 22(ఏ) కింద ఉన్న అంశాలపై దృష్టి సారించాలన్నారు. గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. జలవనరులు గల ప్రదేశాలపై స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్లాలన్నారు. సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ కొల్లాబత్తుల కార్తీక్‌, జేసీ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్‌ఓ ఎన్‌.ఎస్‌.కె. ఖాజావలి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement